ఈ మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న, చిత్ర విచిత్ర విన్యాసాలు అందరూ చూస్తున్నారు. ఊరికే డబ్బా కొట్టుకోవటం కోసం, ఇష్టం వచ్చినట్టు పదవులు ఇస్తున్నారు. లేని పదవులు సృష్టించి మరీ ఇస్తున్నారు. పార్టీ వారికి పదవులు ఇచ్చాం అని చెప్పుకోవటానికి తప్ప, ఆ పదవుల్లో ఉన్న వారు చేసేది ఏమి ఉండదు. నిధులు ఉండవు, చివరకు వారు కూర్చోవటానికి ఆఫీస్ కూడా ఉండదు. ఇంత దారుణంగా అక్కడ పరిస్థితి ఉంటుంది. ఇదే క్రమంలో, పదవులు పిచ్చ పట్టుకున్న వైసీపీ ప్రభుత్వం, నిబంధనలు ప్రకారం, అధికారులకు ఇవ్వాల్సిన పదవులని కూడా, సొంత పార్టీ వాళ్లకి ఇచ్చుకుంది. అసలు తమకు రూల్స్ తో పని లేదు, మా ఇష్టం అనే విధంగా వ్యహరించింది వైసీపీ. ఈ క్రమంలోనే, ఈ విషయం తెలుసుకున్న కేంద్రం, అధికారులకు పదవులు ఇవ్వకుండా, సొంత పార్టీ వారికి ఇచ్చుకోవటం పై, షాక్ అయ్యి, రాష్ట్ర ప్రభుత్వాన్ని వాయించి పడేసింది. దీంతో కేంద్రం దెబ్బతో, జగన్ దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం చీవాట్లతో, వారితో రాజీనామా చేయించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది అక్టోబర్ నెలలో జగన్ మోహన్ రెడ్డి,కొంత మంది పార్టీ వారికి, స్మార్ట్ సిటీ ఛైర్మన్లుగా నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేసి, నానా హంగామా చేసి, మేమే పదవులు ఇస్తున్నాం అని హడావిడి చేసారు.
తీరా చూస్తే, కేవలం అయుదు నెలల్లోనే వారు ఇప్పుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మెన్లుగా, జి.వెంకటేశ్వరరావు, రాజాబాబు, ఎస్.పద్మజను అనే వైసీపీ పార్టీ వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే, స్మార్ట్ సిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ జారీ చేసిన నిబంధలనలకు విరుద్ధంగా, చైర్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నిబంధనలు ప్రకారం, ఛైర్మన్లుగా డివిజనల్ కమిషనరు, కలెక్టరు, మునిసిపల్ కమిషనరు, పట్టణాభివృద్ధి సంస్థ సీఈవోలలో ఎవరో ఒకరిని మాత్రమే, నియమించాల్సి ఉండగా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం పార్టీ వారిని నియమించారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. దీన్ని తీవ్రంగా పరిగణించి, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి, వాటిని వెంటనే రద్దు చేయాలని వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం వార్నింగ్ తో, జగన్ మోహన్ రెడ్డి దిగి వచ్చారు. పార్టీ వ్యక్తులను ఆ పదవుల నుంచి రాజీనామా చేపించారు. కేంద్రం దెబ్బకు దిగి రాక తప్పలేదు.