పోలవరం విషయంలో దాదాపు మూడు నెలలు నుంచి ఉన్న ప్రతిష్టంభన తొలిగిపోయింది... ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు, కాంట్రాక్టర్ మార్పు తదితర విషయాల్లో ఎదురైన అవరోధాలు తొలిగిపోయాయి... చంద్రబాబు ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు... కొత్త టెండర్లను కేంద్రం అడ్డుకున్న సంగతి తెలిసిందే... చంద్రబాబు దసరా పండుగ రోజు, నాగపూర్ లోని నితిన్ గడ్కరీ ఇంటికి వెళ్లి మరీ, టెండర్ల ప్రక్రియ అడ్డుకోవద్దు అని, అవి ఎందుకు అవసరమో మొత్తం వివరించారు... అయినా మూడు నెలలు నుంచి కేంద్రం తాత్సారం చేస్తూ వచ్చింది... ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాలు అన్నిటి పై ఆమోదించింది...
స్పిల్‌వే కాంట్రాక్టు పనులను నవయుగకు అప్పగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పిల్‌వే కాంక్రీట్, స్పిల్‌వే చానల్ పనులను ఇక నవయుగ సంస్థే చేపట్టనుంది. పాత ధరలకే ఈ పనులను చేయనుంది. మంగళవారం ఢిల్లీలో ఏపీ అధికారులతో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పనులను సమీక్షించారు. పోలవరం పనులకు గాను ఏపీ ప్రభుత్వం టెండర్లును పిలవగా.. పాత ధరలకే పనులు చేస్తామని నవయుగ ముందుకురాగా.. ప్రభుత్వం టెండర్లను నిలిపివేసింది. ఇవాళ ఏపీ అధికారులతో సమావేశం అయిన గడ్కారీ ఈ మేరకు ఆమోదం తెలిపారు...
మూడు నెలల నుంచి, కేంద్రం నుంచి ఆ కమిటీ అని, ఈ కమిటీ అని, ఒకరి తరువాత ఒకరు వచ్చారు... ఒకరు కాఫర్ డ్యాం కావాలి అంటారు... ఇంకొకరు అక్కర్లేదు అంటారు.. ఇలా రెండు నెలలు కాలయాపన చేసారు... చంద్రబాబు రంగంలోకి దిగి కాఫర్ డ్యాం లేకుండా ఏ పెద్ద డ్యాం అయినా నిర్మాణం జరిగిందా, ఇది కాఫర్ డ్యాం వల్ల ఉపయోగం అని ఎంత చెప్పినా, అటు నుంచి రియాక్షన్ లేదు... ఎక్కడ నొక్కారో కాని, చంద్రబాబు తీవ్ర ఒత్తిడి మాత్రం కేంద్రం మీద తెచ్చారు అనేది అర్ధమవుతుంది... చివరకు మూడు నెలలు క్రిందట చంద్రాబాబు ఏదైతే చెప్పారో, వాటి అన్నిటికీ ఈ రోజు కేంద్రం ఒప్పుకుంది... చివరకు మనకు పోలవరం పనులు పై మూడు నెలల విలువైన సమయం కోల్పోయాం.. అంతకు మించి, అటు కేంద్రానికి ఒరిగింది ఏమి లేదు... బహుసా, రాజకీయ ఆటలో భాగంగా, ఈ మూడు నెలలు సమయం కావాలని కేంద్రం జాప్యం చేసిందా అని ఆలోచిస్తే, పరిణామాలు అవును అనే అంటున్నాయి..