పత్రికలు ముతబటడం, చానల్స్ ఆపెయ్యటం, రేడియోలో ఆపెయ్యటం, ఇవన్నీ ఎమర్జెన్సీ టైములో వివిధ దేశాధినేతలు తమ వైఫ్యల్యాలు కప్పిపుచ్చటానికి చేసే అప్రజాస్వామిక చర్యలు. అయితే, ఇప్పుడు ఉన్న ఆధునిక సమాజంలో, వీటన్నిటికంటే సోషల్ మీడియా, చాలా ప్రభావితం చేసే మీడియా. అందుకే దీన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. తమ వైఫల్యాలు ప్రజలకు తెలియకుండా ఉండటానికి, అతి త్వరలో ఫేస్‌బుక్, వాట్సాప్ మూతపడబోతున్నాయనే వార్తలు వస్తున్నయి. ప్రస్తుతం బయటకొస్తున్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఈ విషయంలో టెల్కోలు, ఇంటర్నెట్ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

bjp 08082018 2

స్టేక్ హోల్డర్లు, టెలికం కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి టాప్ సైట్లకు అడ్డుకట్ట వేయడమెలా? అన్నదానిపై సమాచారం కోరినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఆలోచన చేసినట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో క్షణాల్లో విస్తరిస్తున్న ఫేక్‌న్యూస్ వల్ల వచ్చే ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు మొత్తంగా సోషల్ మీడియానే మూసేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

bjp 08082018 3

ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని ఇచ్చే పనిలో టెల్కోలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. సలహాలు, సూచనలు అందించి నిర్ణయాన్ని మాత్రం బంతిని తిరిగి మంత్రిత్వ శాఖ కోర్టులోనే వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ‘‘ఇన్‌స్టాగ్రామ్/ఫేస్‌బుక్/వాట్సాప్/టెలిగ్రామ్ తదితర మొబైల్ యాప్స్‌ను నిషేధించేందుకు ఉన్న వివిధ అవకాశాలను, ప్రత్యామ్నాయాలను వెంటనే తెలియజేయండి’’ అంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీవోటీ) జూలై 18న టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, జియో, ఐడియా, వొడాఫోన్ సహా ఇండస్ట్రీ బాడీలకు లేఖలు రాసింది.

bjp 08082018 4

మరోవైపు, తప్పుడు వార్తలు వైరల్ కాకుండా యాప్‌లో మార్పులు చేయాలని వాట్సాప్‌ను కోరినట్టు సమాచారం. అందుకు అనుగుణంగా వాట్సాప్ మార్పులు చేసినప్పటికీ ప్రసార మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆలోచన ఇలా ఉండగా, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయిన సోషల్ మీడియాను అడ్డుకోవడం సాధ్యమేనా? అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అదే జరిగితే అది రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

bjp 08082018 5

ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందో తెలియదు కానీ, ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వల్ల అంతా చెడే జరుగుతోందనుకోవడం తప్పని, దీనివల్ల ఎన్నో గొప్పగొప్ప విషయాలు బయటకు వస్తున్నాయని చెబుతున్నారు. అంతేకాక, చాలా సంస్థలు ఈ మాధ్యమాలను ఉపయోగించుకుని సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయని అంటున్నారు. రాజకీయ వార్తలు ఎలా నియంత్రణ చెయ్యాలో చూసుకోవాలి కాని, మొత్తం సోషల్ మీడియానే బ్లాక్ చేయాలనుకోవడం తగదని, ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read