జగన్ మోహన్ రెడ్డితో, అనుకూలంగా ఉన్నట్టు కనపడుతూనే, చేసేది అంతా వెనక నుంచి చేస్తూ ఉంది కేంద్రం. అనేక అంశాల్లో, జగన్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, వెనుక నుంచి మాత్రం చెయ్యల్సింది అంతా సైలెంట్ గా చేసేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసిన మొదటి పని, చంద్రబాబు మీద కక్ష తీర్చుకునే పనిలో భాగంగా, చంద్రబాబు హయంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను మళ్ళీ సమీక్ష చేస్తాను, రేటు తగ్గిస్తాను అంటూ, చేసిన హడావిడి తెలిసిందే. ఈ చర్యల్లో భాగంగా, సోలార్, విండ్ ఎనర్జీ విధ్యుత్ ఉత్పత్తి కంపెనీలకు చెల్లింపులు కూడా చెయ్యకుండా ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపుగా, 40కు పైగా కంపెనీలు హైకోర్ట్ కు కూడా వెళ్ళాయి. దీంతో హైకోర్ట్ ఈ విషయం పై స్టే ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఈ విషయం ట్రిబ్యునల్ లో కూడా కొట్టేసింది. ఈ నేపధ్యంలోనే, కొన్ని దేశాలు, ఏకంగా ప్రధాన మంత్రికి కూడా ఉత్తరాలు రాసిన సంగతి తెలిసిందే.
మా కంపెనీలను, మీ రాష్ట్రం ఇబ్బంది పెడుతుంది, ఇలా అధికారం మారిన ప్రతి సారి, సమీక్షలు చస్తాం అంటే, ఎవరు పెట్టుబడి పెడతారు ? ఇలాగే కొనసాగితే, ఆ రాష్ట్రంలోనే కాదు, మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టం, అంటూ హుకం జారీ చేసాయి. దీంతో కేంద్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ తెలిసిందే. అయినా సరే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఈ పీపీఏల సమీక్ష పై మొండిగానే ఉన్నారు. ఇక లాభం లేదు అనుకుందో ఏమో కాని, కేంద్రం డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. పాత చట్టానికి, దుమ్ము దులిపింది. 2003 విద్యుత్తు చట్టంలో ఉన్నా, అనేక నిబంధనలు మార్చి, ఈ ఒప్పందాలకు, మరింత భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి, ఒక డ్రాఫ్ట్ బిల్ రెడీ చేసింది.
ఈ బిల్ పై అభ్యంతరాలు, సలహాలు ఉంటే, 21 రోజుల్లో చెప్పాలని, రాష్ట్రాలను కోరింది. ఈ సవరించిన చట్టం ప్రకారం, ఏ రాష్ట్రం అయినా సరే, తాము చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందే. ఈ ఒప్పందాలు పర్యవేక్షణ చేసేందుకు, ఎలక్ట్రిసిటీ కంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ ఒకటి ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఇక ఒప్పందాల్లో ఉన్నట్టు, సోలార్, విండ్ పవర్ కొనాల్సిందే. అల కొనను అంటే, యూనిట్‌కు ఏకంగా 50 పైసల పెనాల్టీ, విధిస్తారు. అలాగే డిస్కం చెల్లింపులు అన్నీ, అదే ఏడాదిలో జరిగిపోవాలి. వచ్చే ఏడాది జనాల పై భారం వేస్తాం అంటే కుదరదు. అలాగే పభుత్వాలు, గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ కూడా, బిల్ లో అడ్జెస్ట్ చెయ్యటం కాకుండా, బ్యాంకు ఖాతాలో వెయ్యాలని, నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక సవరణలతో, కేంద్రం రంగంలోకి దిగుతుంది.