ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక పతనం అంచున ఉంది. ఇప్పటికే జీతాలు ఇవ్వాలి అంటే, రెండో వారం, మూడో వారం కూడా అవుతుంది. ఇక రోడ్డు పనులు కానీ, ఏ అభివృద్ధి పని కానీ జరగటం లేదు. అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. ఆదాయం చూస్తే రోజు రోజుకీ తగ్గిపోతుంది. కంపెనీలు రావటం లేదు. అందుకే పన్నులు రూపంలో అందినకాడికి లాగేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పైన మనమే ఇండియాలో నెంబర్ వన్ గా ఉన్నాం. అలాగే విద్యుత్ చార్జీలు బాదుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, బాత్ రూమ్ పన్ను, ఇలా అనేక చిత్ర విచిత్ర పన్నులతో వాయించి పడేసారు. అయినా వచ్చే ఆదాయం సరిపోవటం లేదు. అలాగే భూములు అమ్మకం పెట్టారు, అయినా సరిపోవటం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏపి ప్రభుత్వానికి అప్పులు దిక్కు అయ్యాయి. ఈ అప్పులు తెచ్చి ఆస్తులు ఏమైనా పెంచుతున్నారా అంటే, ఆ డబ్బులు ఏమై పోతున్నాయో తెలియటం లేదు. చివరకు ఏడాది కాలంలో తేవాల్సిన అప్పు, నాలుగు నెలల్లో తెచ్చేసారు. దీంతో అప్పు ఇచ్చే వారు కూడా లేకుండా పోయారు. ఆర్బిఐ, ఇతర బ్యాంకులు కూడా అప్పు ఇవ్వం అని చెప్పేసాయి. దీంతో ప్రభుత్వానికి ఏమి చేయలో తోచక, వచ్చే నెలలు ఎలా గడపాలో అర్ధం కాక, ఢిల్లీ బాట పట్టారు.

debt 07092021 2

ఆర్ధిక మంత్రి బుగ్గన, ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటూ, ఢిల్లీ పెద్దలను కలిసి, అదనపు అప్పు కోసం చేయని ప్రయత్నం లేదు. రెండు నెలలు నుంచి తిరగగా, తిరగగా, మొన్నటి దాకా అదనపు అప్పు ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పిన కేంద్ర, చివరకు అదనపు ఇవ్వటానికి ఒప్పుకుంది. ఏమి మ్యాజిక్ చేసారో కానీ, కేంద్రం ఒప్పుకోవటంతో, వైసీపీ శ్రేణులు ఎగిరి గంతు వేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి, జగన్ కు ఎంత అండర్ స్టాండింగ్ ఉందో, ఈ చర్యతోనే అర్ధం అవుతుంది. మొత్తం మీద రూ.10,500 కోట్ల అప్పు వరకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇది గట్టిగా రెండు నెలలకు కూడా సరిపోదు, మళ్ళీ కేంద్రాన్ని అడిగి తెచ్చుకుంటారో ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే గండం గట్టేక్కిన్నట్టే. కేంద్రంలో ఉన్న బీజేపీతో ఏదో, విబేధాలు ఉన్నట్టు నటిస్తున్నారు కానీ, ఇద్దరికీ మంచి అవగహన ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రేపటి నుంచి ఏపి సాకుగా చూపి, మిగతా రాష్ట్రాలు కూడా ఇలా అదనపు అప్పు తీసుకుంటే, కేంద్రం ఏమి చేస్తుందో మరి. దేశ, రాష్ట్రాల ఆర్ధిక స్థితి ఏమిటో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే తెలియాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read