Sidebar

12
Mon, May

2015లోనే చంద్రబాబు బయటకు ఎందుకు రాలేదు అంటే, ఇదే కారణం... ఇలా కక్షసాధించి, చంద్రబాబుని, తద్వారా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతారని తెలిసే, చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేసారు... పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రూ.1400 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ రెండు రోజుల కిర్తం అనుమతిచ్చింది. ఇక ఇక్కడ బీజేపీ నాయకులు చూసారా అంటూ, తొడలు కొట్టారు... అయితే, ఇచ్చిన డబ్బులని కూడా ఈ రోజు కోత పెట్టారు... కేంద్రం మరో షాకిచ్చింది. పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టింది. రెండు రోజుల క్రితం చెప్పినట్టు, రూ.1400 కోట్లు ఇవ్వము అంటూ, రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని జలవనరులశాఖ ఆదేశించింది.

polavaram 22032018 2

రెండు రోజుల క్రితం, నాబార్డులో ఉన్న దీర్ఘకాలిక నీటిపారుదల నిధి (ఎల్‌టీఐఎఫ్‌) నుంచి ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖకు వర్తమానం అందింది. ఈ ప్రాజెక్టుకు రూ.1794.37 కోట్ల రుణాన్ని నాబార్డు నుంచి మంజూరు చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కోరగా ఆర్థిక శాఖ ప్రస్తుతానికి రూ.1400 కోట్లకు మాత్రమే అనుమతిచ్చింది. అయితే వ్యయ గణాంకాల ఆడిట్‌, ఖరారు పెండింగ్‌లో ఉన్నందున మధ్యంతరంగా ఈ మొత్తాన్ని విడుదలచేస్తున్నట్లు తెలిపింది.

polavaram 22032018 3

సరే ఎదో ఒకటి వచ్చింది కదా, అనుకుంటున్న టైంలో, మరో రూ.311 కోట్లు కూడా కోత పెట్టి, రూ.1794.37 కోట్లు అడిగితే, చివరకు రూ.1,089 కోట్లు మాత్రమే ఇచ్చింది కేంద్రం... ఇలా ఇచ్చిన డబ్బులు కూడా తీసుకోవటం, కేంద్రానికి కొత్త కాదు.. 350 కోట్లు వెనుకబడిన ప్రాంతాలకు అంటూ ఎకౌంటు లో వేసి, మరీ వెనక్కు తీసుకున్నారు... ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో భవిషత్తులో ఎదుర్కోవాలి.. ఇంకా చాలా వస్తాయి.. సంవత్సరం టైం ఉంది.. ఇబ్బంది పెడుతూనే ఉంటారు... ప్రజలు మానసికంగా సిద్ధం కావలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read