ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇస్తున్న భద్రత విషయంలో, కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అందిరి నాయకులకు ఇస్తున్న ఎస్పీజీ, ఎన్ ఎస్ జీ భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ సమీక్ష జరిపింది. ఈ సమీక్షలో పులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు ఇస్తున్న బ్లాక్ క్యాట్ కమెండో సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. అఖిలేష్ యాదవ్ విషయంలో సమీక్ష జరిపి, ఆయనకు జెడ్ ప్లస్ రక్షణ ఇచ్చే అవసరం లేదని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పింది. అఖిలేష్ సియం అయిన తరువాత, ఆయనకు 22 మందితో NSG కమాండోల బృందంతో భద్రత కలిగించారు. అయితే ఇప్పుడు సమీక్ష జరిపి ఆయనకు షాక్ ఇచ్చారు. అయితే అఖిలేష్ తండ్రి, ములాయంకు మాత్రం జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుంది.

security 24072019 2

ఇలా అందరికీ సమీక్ష జరిపి, దేశంలో మొత్తం, 24 మంది నేతలకు వీఐపీల భద్రతా కవర్ నుంచి కేంద్రం ఉపసంహరించుకుంది. ఇక మన రాష్ట్రానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు భద్రత విషయంలో ఎలా ప్రవరిస్తున్నారో చూసాం. ఆయనకు పూర్తిగా భద్రత తొలగించారు. అయితే, చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత కేంద్ర పరిధిలోది కావటంతో, దాంట్లో ఎలాంటి మార్పు చెయ్యలేదు. దీంతో ఇప్పటికే జగన్, మోడీతో క్లోజ్ గా ఉండటం, ఢిల్లీలో కూర్చుని విజయసాయి రెడ్డి పుల్లలు పెడుతూ ఉండటంతో, కేంద్రం కూడా చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత తొలగిస్తుందని అందరూ భావించారు. కాని, కేంద్ర హోం శాఖ సమీక్షలో, చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

security 24072019 3

ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ వైరం, పర్సనల్ స్థాయిలో ఉండటం, జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులు, అలాగే నక్సల్స్ నుంచి ముప్పు, ఎర్ర చందనం మాఫియా నుంచి ముప్పు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత ఉండాల్సిందే అనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుతో పాటు, కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటుగా మరో 12 మందికి ఎన్‌ఎస్‌జి భద్రత కొనసాగించనున్నారు. ఇక మరో పక్క జగన్ ప్రభుత్వం తనకు భద్రత పూర్తిగా తొలగించటం పై చంద్రబాబు ఇప్పటికే కోర్ట్ కి వెళ్లారు. ఈ పిటీషన్ కోర్ట్ లో విచారణ దశలో ఉంది. భద్రతా పరమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్ట్ లో విచారణ జరపాలెం అని ప్రభుత్వం చెప్పటంతో, ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తెలియాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read