తిరుమల విషయంలో హడావిడి చేసి వెనక్కు తగ్గిన కేంద్రం, గత కొన్ని రోజులగా మన రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం పై కన్నేసిందనే విషయం బయటకు వచ్చింది.... ఎపిలో ఎర్రచందనం పై కేంద్రం పరిశోధన చెయ్యటంతో, ఆంధ్రప్రదేశ్ లోని అటవీ సంపద పై కేంద్రం కన్ను పడిందా అనే అనుమానం కలుగుతుంది...ముఖ్యంగా ఇక్కడి ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద గురించి క్షుణ్నంగా ఆరా తీస్తుంది... అయితే కేంద్రం ఏ కారణంతో ఈ వివరాలు తీస్తోంది ? అనే అనుమానాలు వస్తున్నాయి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడవుల్లో వృక్ష సంపద పరిస్థితి ఏంటి?...ఎలా ఉంది?...ఇక్కడ అత్యంత విలువైన అటవీ సంపద సురక్షితంగానే ఉందా?...అనే విషయాలపై కేంద్రం పరిశోధన చేస్తుంది..
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఎపిలోని అడవుల్లో తమ పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తల బృందం వివిధ అంశాలపై రూపొందించిన నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పించనుంది. ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద రాష్ట్రంలోని నల్లమల, శేషాచలం అడవుల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సంపద స్మగ్లర్ల బారినపడి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. రాష్ట్రంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిలాల్లోని 5,160 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఎనిమిది డివిజన్లలో 3.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విలువైన వృక్షసంపద విస్తరించి ఉంది. ఈ వృక్ష సంపదకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండు ఉంది. అందుకే దీనిని స్మగ్లర్లు దేశ సరిహద్దులు దాటిస్తున్నారు.
బొటానికల్ సర్వే అధికారులు తొలుత తమ సర్వేని కడప జిల్లా అటవీ ప్రాంతం నుంచి ప్రారంభించి కర్నూలు (నల్లమల), కడప (పాలకొండలు, లంకమల), నెల్లూరు, ప్రకాశం (వెలిగొండ), చివరగా చిత్తూరు జిల్లాలోని (శేషాచలం)అడవులతో విజయవంతంగా పూర్తి చేశారు. పరిశోధనలో భాగంగా రోజూ జీపీఎస్ నావిగేషన్ ద్వారా ప్రతి చెట్టు, గడ్డి, రాయి, జీవరాశులు, వన్యప్రాణులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేసుకున్నారు. ప్రత్యేకంగా అరుదైన ఎర్రచందనం, శ్రీగంధం తదితర విలువైన వృక్షాలను కొలతలు తీసి, వాటి స్థితిగతులను కూడా తనిఖీచేసి రికార్డుల్లో పొందుపరిచారు. వీటితో పాటు మిగిలిన విలువైన వృక్ష సంపదపై కూడా పరిశీలన చేశారు. మరి ఈ నివేదికల పై, కేంద్రం ఏమి చేస్తుందో చూడాలి...