రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాలు నీళ్ళ కోసం కొట్టుకుంటూ ఉండటంతో, కేంద్రం ఎంటర్ అయ్యింది. మొత్తం ఎగరేసుకుని పోయింది. కృష్ణా నది ఒక్కటే కాదు, గోదావరి నది మీద ఉండే ప్రాజెక్ట్ లు కూడా ఇక నుంచి కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతాయి. చుక్కు నీరు వదాలాలి అన్నా, విద్యుత్ ఉత్పత్తి చేయాలి అన్నా, ఇక నుంచి కేంద్రం అనుమతి తీసుకోవాలి. అలాగే అక్కడ కేంద్రం బలగాలతో భద్రత ఇస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో పాడిన ప్రేమ గీతాలు, ఇరువురు కలిసి ఆడిన డ్రామాకు, ఈ దెబ్బతో ఫుల్ స్టాప్ పడినట్టే చెప్పాలి. ఇరువురూ తేల్చుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది. కృష్ణా, గోదావారి ప్రాజెక్ట్ అజమయషీ మొత్తం కేంద్రం పరిధిలోకి వీళ్లిపోనుంది. అయితే ఇది ఏడేళ్ళ నుంచి పెండింగ్ లో ఉందని, ఇది విభజన చట్టంలో ఉన్న హామీ అని, మేము నేరవేర్చాం అని బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. కేసీఆర్ దూకుడుకి చెక్ పెట్టాల్సిన జగన్, కేంద్రానికి లేఖలు రాసి, ప్రాజెక్ట్ ల బాధ్యత మొత్తం తీసుకోమని లేఖలు కూడా రాసారు. నిజానికి ఈ పరిణామంతో, కృష్ణా డెల్టాకు ఎక్కువ మేలు ఉంటుంది. రాయలసీమకు మాత్రం ఈ పరిణామం తీవ్ర అన్యాయం కానుంది. మరో పక్క తెలంగాణా కూడా ఇది దెబ్బే అని చెప్పాలి.
మరో పక్క ఈ బోర్డు నిర్వహణ కోసం, 200 కోట్ల రూపాయలు అవసరం అని, ఇరు రాష్ట్రాలు కూడా మొత్తం 400 కోట్లు రూపాయలు జమ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా అనుమతి లేని ప్రాజెక్ట్ లు వెంటనే నిలిపి వేయాల్సి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ లకు ఏమైనా ఆరు నెలల్లో అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తెలంగాణా మాత్రం, పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు చేయకుండా, బోర్డుని ఎలా నోటిఫై చేస్తారు అంటూ తెలంగాణా అభ్యంతరం చెప్తుంది. కేంద్రం మాత్రం, గత ఏడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో నిర్ణయం ప్రకారమే ఇది చేసాం అని చెప్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమలులోకి రానుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయంతో, రాయలసీమకు నీరు ఎలా విడుదల చేస్తారో చూడాల్సి ఉంటుంది. మరో పక్క ఇంత గోల చేసిన రాయలసీమ ఎత్తిపోతలని కూడా ఆపేయాల్సి ఉంటుంది. దానికి మొత్తం అనుమతులు వచ్చిన తరువాతే చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిణామంతో, మరి జల వివాదాలు తొలగిపోతాయో లేదో చూడాలి.