ప‌డుకున్న గాడిద‌ని లేపి త‌న్నించుకోవ‌డంలో వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వెరీ వెరీ స్పెష‌ల్. ఏపీ రాజ‌ధాని కేసులు కోర్టులో ఉన్నాయి. విచార‌ణ‌కి వ‌స్తున్నాయి. అయినా ఆత్రం ఆగ‌ని వైసీపీ నేత‌లు విశాఖే రాజ‌ధాని ఒక‌రు ప్ర‌క‌టిస్తారు. రేపు వెళ్లిపోతామంటారు మ‌రొక‌రు. ఎల్లుండే సామాన్లు స‌ర్దేస్తున్నామ‌ని మ‌రొక‌రి స్టేట్మెంట్. ఇంత గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏపీ రాజ‌ధాని విశాఖ అని తీర్పు ఇచ్చేసింద‌ని టీవీ3*3 త‌ప్పుడు తీర్పు ప్ర‌క‌టించేస్తోంది. కోర్టు విచార‌ణ వ‌ర‌కూ ఆగ‌లేని విజ‌య‌సాయిరెడ్డి రాజ్య‌స‌భ‌లో ఏపీ రాజ‌ధాని గురించి ప్ర‌శ్న అడిగాడు. దీనికి స‌మాధానం ఇచ్చిన కేంద్రం ఏపీ రాజధానిగా అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైంద‌ని తెలియ‌జేసింది. సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని కేంద్రం త‌ర‌ఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.  అమరావతే రాజధాని అని 2015 లో నిర్ణయించారని, ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై మాట్లాడడం సబ్ జ్యుడిస్ అవుతుందని సమాధానం ఇచ్చారు.  2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు తెచ్చే ముందు తమను సంప్రదించలేదని కేంద్రం స్ప‌ష్టం చేసింది.  రాజధానిపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ వేశార‌ని,  ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉండ‌డంతో మాట్లాడ‌కూడ‌ద‌ని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read