ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలు, ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానంతో, వచ్చే ఆదాయం కూడా తగ్గిపోవటంతో, జీతాలకు, పెన్షన్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. కేంద్రాన్ని గట్టిగా అడిగే అవకాసం ఇక్కడ ప్రభుత్వానికి లేకపోవటంతో, విభజన హామీలు ఒక్కటి కూడా అమలు అయ్యే అవకాసం లేదు. ఇక తెలంగాణా విషయానికి వస్తే, రిచ్ స్టేట్ అనుకున్న తెలంగాణా కూడా, ఈ ఏడాడి చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఆర్ధిక మాంద్యం అని చెప్పి, బడ్జెట్ ని తగ్గించి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు, ఇప్పుడు కేంద్రం తీసుకున్న మరో నిర్ణయం షాక్ కి గురి చేసేలా ఉంది. ఈ నిర్ణయం కనుక అమలు అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది.

modi 27092019 2

నిన్న కేంద్ర ప్రభుత్వం, 15వ ఆర్థిక సంఘానికి, ఒక మెమోరాండెం సమర్పించింది. రాష్ట్రానికి తిరిగి ఇచ్చే పన్నుల వాటాలు తగ్గించాలని, 15వ ఆర్థిక సంఘాన్ని కోరింది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలు 42 శాతం ఉంది. అయితే దీన్ని తగ్గించి, 32 నుంచి 34 శాతానికి తేవాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అర్ధిక సంక్షోభం నుంచి, బయట పడటానికి, ఈ చర్య ఉపయోగ పడుతుందని, కేంద్రం భావిస్తుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కటానికి, రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటాను తగ్గించాలని, కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే రాష్ట్రాల ఆదాయాలు తగ్గటం మొదలైన సందర్భంలో, ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యతో, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచనలో పడ్డాయి.

modi 27092019 3

ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం విధానాలు, దక్షినాది రాష్ట్రాలకు ఇబ్బందిగా ఉన్నాయని, చంద్రబాబు ఉన్న సమయం నుంచి ఆందోళన తెలుపుతున్నారు. ఇప్పుడు కేంద్రం కనుక ఈ చర్య తీసుకుంటుంటే, మరిన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పధకాలు పెట్టారు, ఇవన్నీ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. పన్నుల వాటా తగ్గిస్తే, ఇక కేంద్రమే రంగంలోకి దిగి, ప్రజాకర్షన్ పధకాలు, తన ద్వారా చేపట్టే అవకాసం కూడా లేకపోలేదు. రాష్ట్రాలకు ఆర్ధిక స్వేచ్చ మరి కొంత తగ్గించి, ఇక కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే, రాజకీయంగా కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం. మరి ఈ పరిణామాలను, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read