2017లో, గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలు, ఎలాంటి భూసేకరణ బిల్లు అయితే కేంద్రానికి పంపారో, అలాంటి బిల్లే ఆంధ్రపదేశ్ రాష్ట్రం కూడా కేంద్ర ఆమోదానికి పంపింది... అయితే అప్పట్లో, గుజరాత్, తెలంగాణా రాష్ట్రాలు ఇలాంటి భూసేకరణ బిల్లు పెడితే, వెంటనే ఆమోదించింది కేంద్రం... ఒక్క క్లాజులో కూడా మార్పులేని, ఇదే బిల్ మనం కూడా పెట్టాం... కాని మనకి స్పెషల్ ట్రీట్మెంట్, దాదాపు 6 నెలల నుంచి, పెండింగ్ లో పెట్టి, అక్టోబర్ 2017లో కుదరదు, దీనికి వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అని బిల్లుకు బ్రేక్ వేసింది కేంద్రం... ఒక్క క్లాజులో కూడా మార్పులేని తెలంగాణా బిల్లు, గుజరాత్ బిల్లు మాత్రం ఏ ఒక్క శాఖకు పంపకుండా నేరుగా ఆమోదం తెలిపింది. .
మాకు ఎందుకి ఇలా జరుగుతుంది, మీ ప్రశ్నలకు అన్నీ సమాధానం చెప్పాము కదా, మాకు ఎందుకీ వివక్ష అని రాష్ట్రం అడిగితే, ఆ రాష్ట్రాల బిల్లులు మా శాఖకు కేంద్రం పంపలేదు, మీదే వచ్చింది అని కేంద్ర వ్యవసాయశాఖ సమాధానమిచ్చింది... ఈ బిల్లు ఆమోదం పొందక పొతే, అమరావతి నిర్మాణం కూడా హోల్డ్ లోకి వెళ్తుంది... అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ కూడా ఆలస్యం అవుతుంది అని స్వయంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, వెళ్లి జనవరి నెలలో మోడీకి చెప్పారు.. అయినా మార్పు లేదు.. ఇలా ఒక రాష్ట్రాన్ని ఒకలా, మరో రాష్ట్రాన్ని మరోలా కేంద్రం చూస్తుంటే, దీని అర్ధం ఏంటి, అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ లోపు, చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో, సీన్ మొత్తం మారిపోయింది... దీంతో అధికారులు, దీని పై నిత్యం సంప్రదింపులు జరపటం మొదలు పెట్టారు.. కేంద్ర అధికారులు ఎన్ని తిప్పలు పెట్టినా, వారికి సమాధానం చెప్తూ, ఓర్పుగా ముందుకు వెళ్లారు.. ఇక బిల్ ఆమోదించక తప్పని పరిస్థితి వచ్చింది.
ఏపీ అధికారులు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సత్పాల్‌సింగ్‌కు పూర్తి వివరణలు ఇచ్చారు. భూసేకరణ బిల్లుకు సవరణలు చేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును రూపొందించినట్లు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టడం వల్ల ఆహార భద్రతకు ముప్పేమీ రాదని, రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వివరణలతో సంతృప్తి చెందిన హోంశాఖ అధికారులు ప్రస్తుతం అంతిమ ఆమోదం కోసం న్యాయశాఖకు పంపినట్లు తెలిసింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆమోదముద్ర వేస్తే తదుపరి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండువారాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామంతో, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం షాక్ అయ్యింది.. ఈ బిల్ ఆమోదించరు అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన తరుణంలో, కేవలం అధికారుల జవాబులతో, ఆమోదం పొందటం, సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న బిల్ కు గ్రీన్ సిగ్నల్ లభించటంతో, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, కేంద్రంలో ఎందుకో ఇంత సడన్ మార్పు అని మాట్లాడుకుంటున్నాయి.. ఎందుకంటే, ఈ చట్టం ఆమోదం పొందితేనే, ఎన్నో ప్రాజెక్ట్ లు ముందుకు వెళ్ళే అవకాసం ఉంది...