విభజన హామీల పై రాష్ట్రంలో ప్రజలు ఆందోళన బాట పట్టిన నేపధ్యంలో, కేంద్రంలో కూడా కదలిక వచ్చింది... విభజన హామీల పై చర్చించేందుకు, కేంద్ర హోంశాఖ నుంచి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కబురొచ్చింది... ఈ నల 23 వ తేదీన ఢిల్లీ రావాల్సిందిగా, చీఫ్ సెక్రటరీకి, కేంద్ర హోంశాఖ కబురుపంపింది.., కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల పై ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగనుందని, తెలిపింది... విభజన హామీల పై పూర్తి సమాచారంతో రావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి....
రైల్వే జోన్, రెవెన్యూలోటు, ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం పోర్టు, 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజనపై సమావేశంలో చర్చ జరుగనుంది.... అలాగే 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజనకు సంబంధించి చర్చించేందుకు సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆదేశించారు... కాగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఒత్తిళ్లతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చర్చల్లో ఏమేరకు ఫలిస్తాయో.. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి...
అలాగే, చంద్రబాబు కూడా మొదటిసారి బహిరంగంగా స్పందించారు... పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు న్యాయం చేయాలన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీలో చేరామని చెప్పారు. మూడున్నరేళ్లు అయినా ఇంకా హామీలు నేరవేర్చ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరామన్నారు. కేంద్ర బడ్జెట్లో మనకు ఏమీ ఇవ్వలేదని, కొందరు నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని చెప్పారు. లాలూచీ పడ్డారని కొందరు విమర్శలు చేస్తున్నారని, తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే సీఎంగా ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు.