ఈ రోజు బీజేపీ ఎంపీ సి.ఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ  పై  ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. రాష్ట్ర పోలీసులు, వాళ్ళ  ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ళు చేసే ప్రతి పనిని కేంద్ర హోం శాఖ గమనిస్తూనే ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుదని సి.ఎం రమేష్ స్పష్టం చేసారు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యమని , ఎవరు ఎలా ఉన్న పోలీస్ వాళ్ళ విధులను వాళ్ళు కరెక్ట్ గా నిర్త్వర్తించాలి కదా, అంతే కాని మీ ఇష్టానికి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మీరు ఆ రాష్ట్రానికే శాస్వతం కాదు,అవసరమైతే కొందరు ఐపీఎస్‍లను కేంద్రం రీకాల్ చేస్తుంది, ఈ  రాష్ట్ర పోలీసులు తీరును మార్చుకోవాలిసిన అవసరం చాలా ఉందని, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న  బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు  సి.ఎం రమేష్ తెలిపారు. యువకుడు, తెలుసుకుంటాడని, ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం జోక్యం మంచిది కాదని, ఇన్నాళ్ళు ఆగమని, కేంద్రం ఏపి పోలీస్ తీరుని, టెలిస్కోప్ లో గమనిస్తుందని, త్వరలోనే మార్పులు ఉంటాయని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read