ఈ రోజు రాజ్యసభలో, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు, కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆపుల ఊబిలో క్రమక్రమంగా కూరుకుపోతూ ఉంది అనే విషయాన్ని, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేయటం జరిగింది. అయితే ఇందులో విశేషం ఏమిటి అంటే, ఇది బడ్జెట్ యేతర అప్పుగానే కేంద్రం చెప్పింది. అంటే ఇది అసలు బడ్జెట్ లో చెప్పిన విధంగా కాకుండా, బడ్జెట్ యేతర అప్పులుగా కేంద్రం చెప్పటం విశేషం. అసలు ఇది బడ్జెట్ లో పేర్కొనని అప్పు. ఇతర కార్పోరేషన్లు, సంస్థలు, ఇలా వాటి అన్నిటినీ తనఖా పెట్టి, ఈ అప్పులు తీసుకున్నట్టుగా కేంద్రం పేర్కొంది. రాజ్యసభ సాక్షిగా కేంద్రం, అప్పుల లెక్కను చెప్పింది. మొత్తంగా బడ్జెట్ యేతర అప్పు, 2019-20 సంవత్సరానికి రూ. 56,076 కోట్లు అప్పుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తంగా 12 బ్యాంకుల నుంచి ఈ అప్పు తీసుకున్నారు. ఇందులో రూ. 56,076 కోట్లలో అత్యధికంగా, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుంచే రూ.15,000 వేల కోట్ల వరకు, అప్పుగా తీసుకోవటం జరిగింది. అలాగే తరువాత బ్యాంక్ అఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్ల వరకు, బ్యాంక్ అఫ్ ఇండియా రూ. 7వేల కోట్లు, ఇలా దాదాపుగా 12 బ్యాంకుల నుంచి కూడా ఒక్క ఏడాదికి ప్రభుత్వం రూ. 56,076 కోట్లు అప్పు చేసింది.

jagan 10082021 2

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఏపికి `సంబంధించిన అప్పుల కోసం, భవిష్యత్తులో మద్యం పై రాబోయే ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకోవటం, అలాగే ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తీసుకోవటం పై కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అని, వీటికి సమాధానం ఇవ్వాలి అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఏపి ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగిండ్. అలాగే కాగ్ ఆధ్వర్యంలో, పూర్తి స్థాయి ఆడిట్ జరపాలని కూడా కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ మధ్య కాలంలో కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో, బుగ్గన తో పాటుగా, ఇతర అధికారులు కూడా సమావేశం అయ్యి, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ ఉల్లంఘనలు గురించి సమాధానం చెప్పాల్సిందే అంటూ, గట్టిగా చెప్పటంతో, ఏమి చేయలేక, బుగ్గన బృందం తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read