నిన్న ఉన్నట్టు ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తూ, జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక చీఫ్ సెక్రటరీని బదిలీ చెయ్యటం పై, దేశ వ్యాప్తంగా చర్చ అయ్యింది. అదీ కాక, ఆ చీఫ్ సెక్రటరీ, అంతకు ముందే, సియం ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసు ఇవ్వటం, వెంటనే ఆయన్ను బదిలీ చెయ్యటం పై, చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో, ఇప్పుడు కేంద్రం ఎంటర్ అయ్యింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం వేటుపై కేంద్రం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సీఎస్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తలంటినట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు పై ఢిల్లీ పెద్దల ఆగ్రహంగా ఉన్నారనే సమాచారంతో, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా మీమాంసలో పడ్డారు. జరిగిన విషయం మొత్తాన్ని, కేంద్ర ఇంటిలిజెన్స్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకుని, అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి అనే విషయం పై, విశ్లేషణ చేస్తుంది.

lvs 05112019 1 2

ఇక మరో పక్క, కేంద్ర సర్వీసులకు వెళ్లే ఆలోచనలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సేవలను ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం కు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే జరుగుతున్న పరిణామాలు ఏపీ అధికార యంత్రాంగంలో పెద్ద కుదుపునే కుదిపాయని చెప్పొచ్చు. ఏకంగా చీఫ్ సెక్రటరీ అయిన ఎల్వీ పై వేటుతో ఐ ఏ ఏస్, ఐ పీ ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఏ నిమిషాన ఏమి జరుగుతుందో అని తీవ్ర వత్తిడిలో అధికార యంత్రాంగం ఉంది. మాజీ ఐఏఎస్ అధికారులు కూడా, ఎల్వీకి మద్దతుగా నిలుస్తు, ప్రభుత్వ చర్యను తప్పు బడుతున్నారు.

lvs 05112019 1 3

ఇక మరో పక్క ఎల్వీ బదిలీ పై, జగన్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎల్వీకి మద్దతుగా బ్రాహ్మణ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఆయన క్రీస్టియన్ మతానికి చెందిన వారిని, తిరుమల సహా వివిధ గుడిల నుంచి, విధులు నిర్వహించకుండా, పంపించారని, అదే వారికి కోపం అని, దానికి బహుమతిగానే ఎల్వీ బదిలీ అంటూ, విమర్శలు చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ కూడా ఇదే విషయమై, జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. క్రిస్టియన్ మిషనరీ మాఫియా ఒత్తిడితోనే ఎల్వీని బదిలీ చేశారన్న వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, బదిలీకి గల నిజమైన కారణాలను ఏపీ సీఎం జగన్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read