ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అనేక ఇబ్బందులు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ఐటి దాడులు, మరో పక్క రాజకీయ కుట్రలు, ఇలా అన్ని వైపుల నుంచి, వస్తున్నారు. వీటి పై చంద్రబాబు స్పందించారు. నిన్న జరిగిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు మాట్లాడుతూ, కేంద్రం చేస్తున్న ఇబ్బందులు చెప్పుకొచ్చారు. మనకు రావాల్సిన హక్కులు అడుగుతుంటే, ఇలా చేస్తున్నారని, కుట్రలు చేసి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. వైజాగ్ ని టార్గెట్ చేస్తూ, వందల మంది ఐటి అధికారులు వచ్చారని, వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టే కుట్రలో భగంగా ఇవన్నీ చేస్తున్నారని అన్నారు.
ఒక పక్క ఫిన్ టెక్ సదస్సు, ఒక పక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ప్రపంచం ఫోకస్ ఇక్కడ ఉన్న టైంలో, కావాలని కుట్ర పన్ని, ఐటి దాడులు చేసారు. ఇక్కడ ఎదో జరుగుతుందని, అందరి ఫోకస్ వైజాగ్ మీద పెట్టారు, అందరి ఫోకస్ ఈ సిటీ మీద ఉండగా, కోడి కత్తి డ్రామా ఆడారు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. వీళ్ళు ఇక్కడితో ఆగారు, ఇంకా చాలా చేస్తారు, నేను అన్నటికీ సిద్ధపడుతున్నా అని అన్నారు. వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ పోలవరం పై పడింది. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా, పనులు జరుగుతున్నాయి అని కసితో, నవయుగ పై ఐటి దాడులు చేసారు అని చంద్రబాబు అన్నారు.
నవయుగ లాభాల కోసం పనులు చేయడం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి మంచిదనే ఉద్దేశంతో నవయుగ నష్టాలొచ్చిననా పనిచేస్తోందని చెప్పారు. జనవనరులశాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘నవయుగ వంటి సంస్థ పై దాడులు చేస్తే వారికి ఎటువంటి ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోగలం. దీని వల్ల పోలవరం పనులకు ఆటంకం కలగకూడదని భావిస్తున్నాం. పోలవరం పనులపై ముందుకు వెళ్లాలనేదే మా ఆకాంక్ష. ఐటీ దాడులు చేసి అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు. దీనివల్ల ప్రాజెక్టుకు ఏం ఇబ్బంది వస్తుందో తెలియదు’’ అని చంద్రబాబు ఆరోపించారు.