జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ముందుగా తన సొంత టీంను రెడీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, కీలకమైన ఇంటలిజెన్స్ డిపార్టుమెంటు హెడ్ కోసం, తెలంగాణా అధికారిగా పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను అడిగిన సంగతి తెలిసిందే తెలంగాణాలో ఐజీ క్యాడర్ లప్ పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్ పై తమ రాష్ట్రానికి ఇవ్వాలని తెలంగాణా సియం కేసిఆర్ ను అడిగారు జగన్. అప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ భవనాలు జగన్, కేసిఆర్ కి ఇచ్చేయటంతో, కేసిఆర్ కు వెంటనే సై అన్నారు. దీంతో స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్ పై తమ రాష్ట్రానికి పంపాలని జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అప్పటికే స్టీఫెన్ రవీంద్ర, తెలంగాణా క్యాడర్ లో సెలవు పెట్టేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. కీలకమైన ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డిపార్టుమెంటు లో స్టీఫెన్ రావింద్రం అనధికారిక విధులు నిర్వహిస్తున్నారు.
అయితే ఆయన్ను పంపించాలని రెండు నెలల క్రితం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనే కేంద్రం సంస్థను కోరినా, ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. సరైన కారణం చూపించకుండా, మాకు ఇష్టమైన అధికారి పంపించండి అంటే, పంపించటం కుదరదని, సరైన కారణాలు చెప్తేనే, పంపిస్తామని, అందుకే అనుమాని ఇవ్వటం లేదని తెలుస్తుంది. మరో పక్క ఇప్పటికే తెలంగాణాలో తక్కువ మంది ఐజిలు ఉండటం కూడా మరో కారణం అని సమాచారం. ఐజీతో పాటు, పై స్థాయి క్యాడర్ ఉన్న అధికారి, వేరే రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళాలి అంటే ప్రధాని ఆమోదం తప్పనిసరి అని తెలుస్తుంది. దీంతో రెండు నెలలు అయినా, ఇంకా ఆమోదం రాకపోవటంతో, ప్రధానితోనే ఈ విషయం చర్చించి నిర్ణయం అమలు అయ్యేలా చూడాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రెండు నెలలు అయినా, ఢిల్లీలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నా, ఇప్పటి వరకు, జగన్ కోరుకుంది జరగలేదు.