మమ్మల్నే ఎదురిస్తారా, మీకు ఇక చుక్కలే.. ఇది, మూడు నెలల క్రితం, ఆంధ్రప్రదేశ్ నేతలను ఉద్దేశించి, ఒక బీజేపీ నేత చేసిన వ్యాఖ్య... వారు అన్నట్టే జరుగుతుంది. ఎన్డీఏలో ఉన్నప్పుడు, ఎంతో కొంత సాయం ఉండేది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, నిధులు మాత్రమే కాదు, అనుమతులు కూడా నిలిచిపోయాయి. పోలవరం నుంచి, ప్రతిదీ ఇలాగే, కక్షసాధిస్తుంది కేంద్రం. తాజాగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై కూడా అదే వైఖరి. సింగపూర్‌కు ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసు నడిపే విషయంలో డీజీసీఏ నో అనేసింది. దేశీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్టు తెలిసింది.

singapore 08072018 2

ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతులు ఇవ్వలేమని చెబుతున్న డీజీసీఏ కేరళ, గోవా, తమిళనాడులకు అనుమతులు ఇచ్చారు. అక్కడ ఇవ్వగా విజయవాడ నుంచి ఇవ్వటానికి సమస్య ఏమిటో అర్థం కాని పరిస్థితి. అయినా పట్టు వదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు. ప్రభుత్వం తరపున తాము చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపటానికి అనుమతులు కోరుతున్నామని ఏపీఏడీసీఎల్‌ అధికారులు తాజాగా డీజీసీఏ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రభుత్వాల తరపున చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపటానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కూడా డీజీసీఏ నుంచి అనుమతులు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపాలని నిర్ణయించటం మంచిదే. టికెట్‌ ధర నియంత్రణ కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.

singapore 08072018 3

విజయవాడ (గన్నవరం)- సింగపూర్‌ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 86 వేల మంది (సంస్థ వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ద్వారా) సానుకూలంగా స్పందించారు. 79404మంది www.APADCL.com వెబ్ సైటులో స్పందించగా, 1335 మంది ఈమెయిల్ లో, 4020 మంది వాట్స్ అప్ లో, 1993 మంది sms రూపంలో, స్పందించారు. అయినా కేంద్రం కనికరించటం లేదు. ఇప్పటికే కేంద్ర సహకార లేమితో విజయవాడ నుంచి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు కలగానే మిగిలిపోయింది. ముంబైకి విమనా సర్వీసు నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఇమిగ్రేషన్‌ ఏర్పడిన తర్వాత దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసులు నడుపుతానని చెప్పింది. తీరా వచ్చాక ఈ సంస్థ వెనుకడుగు వేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌ గజపతిరాజు రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖ నుంచి కూడా సహకారం రావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read