2015లోనే చంద్రబాబు బయటకు ఎందుకు రాలేదు అంటే, ఇదే కారణం... ఇలా కక్షసాధించి, చంద్రబాబుని, తద్వారా రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతారని తెలిసే, చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేసారు... పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రూ.1400 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మర్చి నెలలో అనుమతిచ్చింది. ఇక ఇక్కడ బీజేపీ నాయకులు చూసారా అంటూ, తొడలు కొట్టారు... అయితే, ఇచ్చిన డబ్బులని కూడా ఈ రోజు కోత పెట్టారు... కేంద్రం మరో షాకిచ్చింది... రెండు రోజుల్లోనే వెనక్కు తగ్గింది.. మార్చ్ 22 వ తేదిన, పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టింది. రూ.1400 కోట్లు ఇవ్వము అంటూ, రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని జలవనరులశాఖ ఆదేశించింది.
సరేలే చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని, కనీసం ఆ డబ్బులు అన్నా ఇస్తారులే అని రాష్ట్రం ఎదురు చూసింది... మార్చి అయిపొయింది, ఏప్రిల్ అయిపొయింది, ఇప్పుడు మే నెలకు వచ్చాం... రూపాయి అంటే, రూపాయి ఇప్పటి వరకు ఇవ్వలేదు.. ఆర్ధిక సంవత్సరం చివరిలో డబ్బులు ఇవ్వటం కుదరలేదు అని చెప్పారు.. సరే ఏప్రిల్ నెలలో ఇస్తారులే అని ఎదురు చూపులు చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఈ లోపు, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎదో ఆపరేషన్ చెయ్యటంతో, ఆయన అందుబాటులో లేరని, ఆర్దిక సంవత్సరం మారిపోయింది కాబట్టి, ఆయన అప్రూవల్ కావాలని ఆర్ధిక శాఖ అధికారులు, రాష్ట్రానికి చెప్పారు..
మే నెల వచ్చినా డబ్బులు రాకపోవటంతో, అధికారులు కేంద్రానికి మళ్ళీ లేఖలు రసారు... మార్చ్ నెలలో విడుదల చెయ్యాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.1,089.07కోట్లు త్వరలోనే డబ్బులు ఇస్తున్నాం అని, కేంద్ర జలవనరులశాఖ ఈ మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థకు లేఖ రాసింది. రూ.1794.37 కోట్ల రుణాన్ని నాబార్డు నుంచి మంజూరు చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కోరగా, ముందు రూ.1400 కోట్లు ఇస్తాం అన్నారు, తరువాత రూ.1,089 కోట్లు మాత్రమే ఇస్తాం అన్నారు. చివరకు మూడు నెలలు అయినా, ఒక్క పైసా వదలలేదు. ఇలాంటివి ఇంకా ఎన్నో భవిషత్తులో ఎదుర్కోవాలి.. ఇంకా చాలా వస్తాయి.. సంవత్సరం టైం ఉంది.. ఇబ్బంది పెడుతూనే ఉంటారు... ప్రజలు మానసికంగా సిద్ధం కావలి...