అమరావతి పై కేంద్రం మరోసారి మాట మార్చింది. ఆంధ్రప్రదేశ్ర్ రాజధాని ఏమిటో ప్రజలకే కాదు, కేంద్రానికి కూడా అర్ధం కావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, అసలు మన రాజధాని ఏది అనేది ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. కనీసం మన రాజధాని ఏమిటో, రాష్ట్ర ప్రభుత్వానికి అయినా తెలుసా లేదో అనేది తెలియాల్సి ఉంది. మొన్నటి వరకు అమరావతి రాజధాని అనేది అందరికీ తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, మన రాజధాని మూడు ముక్కలు అయ్యింది, ఒకటి అమరావతి, ఒకటి కర్నూల్, ఒకటి విశాఖ. అసలు ఇందులో ఏది రాజధాని అనేది ఎవరికీ తెలియదు. చివరకు కేంద్రానికి కూడా కన్ఫ్యూషన్ వచ్చింది. ఈ నేపధ్యంలోనే ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్ రెడ్డి, అసలు మా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటూ కేంద్ర హెంశాఖకు ఒక ఆర్టిఐ పెట్టుకున్నారు. అయితే ముందుగా, తాము ఈ ప్రశ్నకు సమాధానం చెప్పం అని కేంద్రం చెప్పింది. అయితే తాము ఏమి దేశ రహస్యాలు అడగటం లేదని, చెప్పకపోతే కోర్టుకు వెళ్తాం అంటూ హెచ్చరించటంతో, ఎట్టకేలాకు జవాబు ఇచ్చింది. అందులో కేంద్రం దానికి సమాధనం ఇస్తూ, మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందులో ఏది రాజధాని అనే విషయం రాష్ట్రమే ప్రకటిస్తుందని పేర్కొంది.
అయితే కేంద్రం సమాధానం పై అందరూ షాక్ అయ్యారు. మొన్నటి దాకా అమరావతి రాజధాని అని చెప్పి, ఏకంగా పార్లమెంట్ లో కూడా ప్రకటించి, ఇండియా పొలిటికల్ మ్యాప్ లో కూడా పెట్టి, ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్పటం పై పలువురు అభ్యంతరం చెప్పారు. ఈ విషయం అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవీఆర్ శాస్త్రి సీరియస్ అయ్యారు. కేంద్ర హోం శాఖకు ఈ ఆర్టిఐ సమాధానం పై ఫిర్యాదు చేసారు. దీంతో కేంద్రం ఏమనుకుందో ఏమో కానీ, మాట మార్చేసింది. మళ్ళీ ఆర్టీఐ కార్యకర్త చైతన్యకుమార్ రెడ్డికి, మరో సమాధానం పంపించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, తాము ఏమి చెప్పలేం అంటూ మాట మార్చి, మళ్ళీ సమాధానం పంపించింది. దీంతో మూడు రాజధానుల ప్రకటన నుంచి కేంద్రం మళ్ళీ వెనక్కు తగ్గింది అనే చెప్పాలి. అయితే ఇలా రకరకాలుగా ఎందుకు కేంద్రం చెప్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక్కడ బీజేపీ నేతలు మేము అమరావతికి అనుకూలం అంటారు, అక్కడేమో రకరకాలుగా మాట్లాడుతున్నారు.