అప్పులు తీసుకోకుండా, ఏ ప్రభుత్వం కూడా నడవదు. అయితే అప్పులు చేసి ఏమి చేస్తున్నారు అనేది ముఖ్యంగా. ఎవరైనా అప్పులు చేస్తే, ఆస్తులు క్రియేట్ చేసుకుంటాం. లేదా వ్యాపారంలో పెట్టుకుంటాం, ఇల్లు కొనుక్కుంటాం. ఇలాంటి అప్పుతో ఇబ్బందే ఉండదు. కొంత మంది చేసే అప్పులు మరీ భయంకరంగా ఉంటాయి. ఎందుకు అప్పులు చేస్తున్నారో తెలియదు. అప్పు చేస్తారు, ఖర్చు పెట్టేస్తారు. డబ్బులు అయిపోగానే మరో అప్పు చేస్తారు. వాడి దగ్గర ఇల్లు ఉంటే తాకట్టు పెట్టుకుని అప్పు ఇస్తాడు. అది కూడా అయిపోతేనే, ఇంట్లో వస్తువులు తకాట్టు పెడతాడు. అది కూడా అయిపోతే, ఇంట్లో నగలు కూడా తాకట్టు పెడతాడు. చివరకు అప్పు దొరక్కపోతే ఊళ్ళో జనాల మీద పడి పీక్కుతింటాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు అనేవి కొత్త కాదు. గత 63 ఏళ్ళలో వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అయితే, ఇప్పుడు జగన మోహన్ రెడ్డి రెండేళ్ళలోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేసేసారు. గతంలో చంద్రబాబు చేయలేదా అంటున్నారు. గతంలో చంద్రబాబు అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టాడు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, అభివృద్ధి మాత్రం ఉండటం లేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి.

rs jagan 07122021 2

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అప్పుల విషయం ఒప్పుకోవటం లేదు. తక్కువ చేసి చెప్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల గుట్టుని కేంద్రం విప్పింది. ఇది వివిధ కార్పోరేషన్ల నుంచి తీసుకున్న అప్పు. ఇందులో రిజర్వ్ బ్యాంక్ నుంచి వారం వారం తీసుకునే అప్పు కలపలేదు. ఈ రోజు రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమేడల, 2019 నుంచి 2021 నవంబర్ వరకు ఏపికి ఏఏ బ్యాంకులు, ఎంత అప్పు ఇచ్చేయని అడిగారు. దీనికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ సమాధానం ఇచ్చారు. ఈ రెండేళ్ళలో మొత్తం రూ.57,479 కోట్లు అప్పుని, పది జాతీయ బ్యాంకులు ఇచ్చాయి. మొత్తం ఏపీలో ఉన్న 40 ప్రభుత్వ కార్పొరేషన్లుకు ఈ రుణాలు ఇచ్చారు. ఈ అప్పు, వడ్డీ చెల్లించే బాధ్యత ఆయా కార్పోరేషన్లదే అని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తంగా, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అందరి కంటే ఎక్కువగా రూ.11,937 కోట్లు రుణం ఇచ్చింది. మొత్తం తొమ్మిది ప్రభుత్వ కార్పోరేషన్లకు ఈ లోన్లు ఇచ్చారు. తరువాత బీవోబీ రూ.10,865 కోట్లు అప్పు ఇచ్చింది. ఇలా పది బ్యాంకులు ఇచ్చాయి. ఇవి అన్నీ బయటకు తెలిసినవి, బయటకు తెలియనవి, ఎన్ని ఉన్నాయో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read