ఇప్పటికే పోలవరం విషయంలో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో, రాష్ట్ర ప్రజలతో సహా, అందరూ షాక్ లో ఉన్నారు. గత చంద్రబాబు హయంలో 55 వేల కోట్ల పోలవరం అంచనాలు ఆమోదించిన కేంద్రం, ఇప్పుడు దాన్ని 20 వేల కోట్లకు తగ్గిస్తూ, నిర్ణయం తీసుకుంది. దీని పై ఇప్పటికే తర్జనబర్జనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయండి ప్లీజ్ అంటూ, కేంద్రానికి నిన్న ఒక లేఖ కూడా రాసింది. కేంద్రాన్ని గట్టిగా , రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలని, పోలవరం విభజన చట్టంలో పెట్టిక హక్కు అంటూ, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. రేపు పీపీఏ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఈ విషయం పై తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలో, మరో పిడిగు లాంటి వార్తా కేంద్రం చెప్పింది. ఇది చాలా అసంబద్ధంగా ఉందని, కేంద్రం కావాలనే ఇలా చేస్తుందని, పలువురు వాపోతున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం కోసం విడుదల చేసిన డబ్బులు, కేవలం పోలవరం ప్రాజెక్ట్ కే వాడారనే పద్దులు చూపించాలని కేంద్రం కోరుతుంది. ఇలా ఖర్చు చేసారని నిరూపిస్తేనే, తాము మిగతా డబ్బులు విడుదల చేసామని కేంద్రం అంటుందని, ఇదే విషయం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా కేంద్రం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.
కేంద్రం నుంచి మనకు ఇంకా రూ.2234.288 కోట్లు, మన రాష్ట్రం, గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన సొమ్ము రావాల్సి ఉంది. అయితే కేంద్రం పెట్టిన తాజా షరతుతో, ఈ డబ్బులు వచ్చే అవకాసం లేదు. కేంద్రం ఇలాంటి కొర్రీలు కావాలని పెడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీయకపోతే, ఇలాగే ఆడిస్తారని అంటున్నారు. ఎందుకంటే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక పద్దు పెట్టి అందులో డబ్బులు వేసి వాడుకోమని చెప్పటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు చేసి, దానికి సంబందించిన వివరాలు అన్నీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపిస్తే, వివిధ స్థాయిల్లో ఈ లెక్కలు అన్నీ పరిశీలించి, కేంద్రం ఇస్తుంది. కేంద్రం అన్నీ పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దానికి రీఇంబర్స్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇలా చెప్పటం, పూర్తి విరుద్ధం అని, కేంద్రం నిర్ణయంతో అసలకే ఎసరు అని అంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాలు పై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉండాలని, అన్న అంశాల్లో రేపు జరిగే సమావేశంలో కేంద్రాన్ని నిలదీయాలని, రాజకీయాలకు తావు లేకుండా, రాష్ట్రం కోసం, కేంద్రాన్ని దీటుగా ప్రశ్నించాలని కోరుకుంటున్నారు.