జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటుపై ‘స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ (ఎంవోఎ్‌సపీఐ)’ శాఖకు చెందిన ఒక ఉపకమిటీ రూపొందించిన నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2010-11ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని జీడీపీ వృద్ధి రేటును లెక్కిస్తే.. ప్రస్తుత ఎన్డీయే హయాం కన్నా యూపీఏ హయాంలోనే అధిక వృద్ధి రేటు ఉన్నట్టు ఆ నివేదిక సారాంశం. దీంతో బీజేపీ-కాంగ్రె్‌సల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ కథేంటంటే.. జీడీపీ వృద్ధి రేటు లెక్కింపునకు నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషిన్‌ ఒక ఉపకమిటీని నియమించింది. ‘కమిటీ ఆన్‌ రియల్‌ సెక్టార్‌ స్టాటిస్టిక్స్‌’ పేరుతో ఏర్పాటైన ఈ కమిటీ 2004-05కు బదులు 2010-11ను ప్రామాణిక సంవత్సరంగా తీసుకుని వృద్ధి రేటును లెక్కించి నివేదికను ఎంవోఎ్‌సపీఐ వెబ్‌సైట్‌లో పెట్టింది.

modi 22802018 2

కొత్త లెక్క ప్రకారం 2007-08లో, 2010-11లో 10 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదైనట్టు అందులో పేర్కొంది. అది ప్రస్తుత ఎన్డీయే హయాం కన్నా ఎక్కువ. జూలై 25న ఆ కమిటీ ఈ నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టగా.. కొద్దిగ ఆలస్యంగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త లెక్కల ప్రకారం తమ పదేళ్ల పాలనలో సగటున 8.1 శాతం వృద్ధిరేటు నమోదుకాగా.. ప్రస్తుత ఎన్డీయే పాలనలో కేవలం 7.3 శాతం సగటు వృద్ధిరేటు నమోదయినట్టు కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. ఆధునిక భారతదేశ చరిత్రలో రెండంకెల వృద్ధి రేటు నమోదైంది తమ పాలనలోనేనని గుర్తుచేసింది. మరోవైపు.. ‘‘సత్యమే గెలిచింది. యూపీఏ పాలించిన 2004-14 సంవత్సరాలే ఆర్థిక వృద్ధికి ఉత్తమమైనవని కొత్త లెక్కలతో తేలిపోయింది’’ అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్వీట్‌ చేశారు.

modi 22802018 3

ప్రస్తుత హయాంలో నాలుగేళ్లు ముగిశాయని.. కనీసం ఐదో సంవత్సరంలోనైనా మోదీ సర్కారు తన పాలన బాగా కొనసాగిస్తుందని భావిస్తున్నానని వ్యంగ్యంగా అన్నారు. మోదీ సర్కారు యూపీఏ-1ను ఎప్పటికీ అందుకోలేదని.. కనీసం యూపీఏ-2ను అందుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో మాటల యుద్ధం మొదలైంది. యూపీఏ హయాంలో నమోదైన వృద్ధి అంతా.. అంతకుముందు అద్భుతంగా పాలించిన వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు చలవేనని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బ్లాగులో రాశారు. ఆ సంస్కరణల ఫలాలు రావడం ముగిశాక యూపీఏ హయాంలో వృద్ధిరేటు దిగజారడం ప్రారంభించిందని విమర్శించారు. 2014లో యూపీఏ ఓడినా ఆ ఫలితాలు ఇంకా కొనసాగుతున్నాయని ఎదురుదాడి చేశారు. ఈ మాటల యుద్ధం ఇలా కొనసాగుతుండగానే.. ఎంవోఎ్‌సపీఐ వెబ్‌సైట్‌ నుంచి ఆ నివేదిక ఉన్న పేజీ మాయమైంది. అది తుది నివేదిక కాదని.. సంప్రదింపులు, చర్చల కోసం మాత్రమే దాన్ని సైటలో పెట్టామని ఎంవోఎ్‌సపీఐ వివరించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read