నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ... ఒకవైపు ఢిల్లీ లో కూర్చోని నేషనల్ మీడియా ముందు .. మాకు అన్ని రాష్ట్రాలూ సమానమే .. గుజరాత్ పై ప్రత్యేక అభిమానం ఏమీ లేదు.. ఆంధ్రాకు 85 శాతం చేసేసాం.. లక్షల లక్షల కోట్లు ఇచ్చాం.. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, జీవీఎల్, సోము, కన్నా, లాంటి నేతలు చెప్పిందే చెప్పి, ప్రజల చెవిల్లో నుంచి రక్తం వచ్చేలా, సొల్లు చెప్పారు... ఇప్పుడు తాజాగా మరో నయవంచన చేసింది కేంద్రం... విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ఫ్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తేల్చి చెప్పింది. విభజన హామీల అమలుపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం తెలిపింది.

steelplant 13062018 2

తొలి ఆరు నెలల్లోనే సాధ్యం కాదని చెప్పినా.. పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వచ్చాయన్న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్పష్టంగా నివేదిక వచ్చినట్టు పేర్కొంది. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఆర్నెళ్లలోనే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకాదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు నష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పామని స్పష్టం చేసింది. అలాగే ఖనిజాలు దొరకడం కూడా కష్టతరమైన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కొత్తగా రెండు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదని తాము స్పష్టంచేశామని కేంద్రం తెలిపింది.

steelplant 13062018 3

మరో పక్క స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌కు లంకె ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ‘మా రాష్ట్రంలో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇనుప ఖనిజ లభ్యతపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరిపిన మెకాన్‌ సంస్థకు కోరినంత సమాచారం అందించాం. ఆ సంస్థ ముసాయిదా నివేదిక ఇవ్వడంతో రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు మార్గం సుగమమైందని సంతోషించాం. కానీ తెలంగాణ నుంచి నివేదిక రాలేదంటూ ఆంధ్రలో స్టీల్‌ ప్లాంటు అంశాన్నీ అటకెక్కించడమేంటి’ ఏపీ గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఏపీఎండీసీ ఎండీ సీహెచ్‌వీ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. మరి ఇంత వంచన చేస్తుంటే, కడప పౌరుషం అంటూ చెప్పే జగన్, జెండా పౌరుషం అంటూ చెప్పే పవన్, రాయలసీమ ఉద్యమం అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, ఒక్క మాట మాట్లాడటం లేదు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే, సియం రమేష్ మాట్లాడుతూ, దీని పై నిరసన తెలియచేస్తూ, కేంద్ర వైఖరికి నిరసనగా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read