జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్తులకు వైసీపీ జెండా రంగులు వేసి, ఇదేదో రాజ్యపాలన అన్నట్టు చేస్తున్నారు. వారు కట్టిన భవనాలు అయితే అనుకోవచ్చు, గతంలో వివధ ప్రభుత్వ హయంలో కట్టిన వాటికి కుడా, తామే ఏదో కట్టాం అన్నట్టు, అన్నిటికీ రంగులు వేసి పడేస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు కాని, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కాని, కేంద్రం కాని, ఇలనాటి ధోరణితో ఎప్పుడు ఇలా చెయ్యలేదు. పంచాయతీ భవనాలు, మునిసిపల్ భవనాలు, వాటర్ ట్యాంక్లు, స్మసానాలు, బెంచీలు, బోరులు, ఇలా ఒక్కటేమిటి, ఏది దొరికితే అది, ఏది పడితే అది, అన్నిటికీ వైసిపీ జెండా రంగులు వేసేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ భవనాలకు, ఒక పార్టీ రంగు వెయ్యటం పై, తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. పంచాయతీ ఆఫీస్ కాని, మునిసిపల్ ఆఫీస్లు కాని, ప్రజలందరూ వచ్చే చోటు అని, అదేమీ పార్టీ భవనం కాదని అంటున్నారు.
రేపు ఎన్నికలు వస్తాయి. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఎన్నికల కోడ్ అఫ్ కాండక్ట్ ప్రకారం, ఇలా రంగులు వేసిన బిల్డింగ్లలో ఓటు వెయ్యటానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు. మరి అప్పుడు, మళ్ళీ వీటి అన్నిటికీ, తెల్ల రంగు వేస్తారా ? మళ్ళీ ఇది ఒక ఖర్చా ? ఇలాంటి వాటికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందొ లేదో మరి. అయితే ఇదే విషయం పై ఇప్పుడు కేంద్రం ద్రుష్టి పెట్టింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై కేంద్రం సీరియస్ అయింది. గ్రామ సచివాలయ పరిపాలన రాజకీయాలకు అతీతంగా జరగాలని, ఆ భవనాలకు రాజకీయ రంగు పులమడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
వైసీపీ చేస్తున్న పనుల పై ఆదివారం టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో కేంద్రమంత్రి తోమర్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయం పై, రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మెమో జారీ చేయాలంటూ తన జాయింట్ సెక్రటరీ రిజ్వీని ఆదేశించారు. ఇది ఒక్కటే కాకుండా, రాష్ట్రంలో ఉపాధిహామీ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించేలా చూడాలని కూడా కేంద్రాన్ని, టిడిఫై ఎంపీలు కోరారు. తెలుగుదేశం హయంలో చేసిన ఉపాధి హామీ పనులకు గాను, కేంద్ర ప్రభుత్వం, రూ.1845 కోట్లు విడుదల చేసిందని, దీనికి మెటీరియల్ కాంపొనెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.615 కోట్లు కలిపి మొత్తం రూ.2,460 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి వరకు, ఎలాంటి చెల్లింపులు చెయ్యలేదని, కేంద్రం ఇచ్చిన .1845 కోట్లు , దారి మళ్ళించారని, ఫిర్యాదు చేసారు.