రెండు తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని కేంద్రం ఒక చట్టం తీసుకువచ్చింది. ఇందులో అనేక నిర్ణయాలు, రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోతుంది కాబట్టి, ఏపికి ఎక్కవుగా ఈ చట్టంలో పెట్టారు. అయితే, అవి ఎంత వరకు నేరవేరాయో, ప్రజలకు తెలుసు. ప్రజలకు ఉపయోగపడే విభజన హామీలు, ఒక్కటీ ఇప్పటి వరకు నెరవేరింది లేదు అనే చెప్పాలి. అయినా ప్రజలు కేంద్రంతో పోరాడే వారిని పక్కన పెట్టి, కేంద్రంతో లాలూచి పడే వారినే ఎన్నుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ విభజన హామీల్లో, ఏపికి వివక్ష కొనసాగుతూనే ఉంది. అప్పటి కాంగ్రెస్ డైరెక్ట్ గా గొంతు కొస్తే, ఇప్పటి బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా చేసింది ఏమి లేదు. అయితే వీరు డైరెక్ట్ గా కోయ్యకుండా, తడి గుడ్డతో, నొప్పి తెలియకుండా కోస్తున్నారు. ఇప్పుడు కూడా, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సమస్యల పై కేంద్రం వైపు చూస్తున్నా, కేంద్రం కనీసం పట్టించుకోవటం లేదు.
రాష్ట్రంలో అమరావతి విషయం తీసుకుంటే, ఇప్పటికే 10 వేల కోట్లు ఖర్చు చేసి, రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చిన తరువాత, కేంద్రం కూడా 1500 కోట్లు ఇచ్చిన తరువాత కూడా, అమరావతిని మూడు ముక్కలు చేస్తాం అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, కనీసం కేంద్రం పట్టించుకోవటం లేదు. అది మా సమస్య కాదు అని చేతులు దలుపుకుంటుంది. ఇక పోలవరం విషయంలో కూడా అంతే. 72 శాతం పోలవరం పూర్తి చేసిన నవయుగని మార్చేసి, ఈ 10 నెలల్లో, కనీసం 2 శాతం పనులు కూడా పూర్తి చెయ్యకుండా రాష్ట్రం ఉంటే, ఆ విషయంలో కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇక వెనుకబడిన జిల్లాలకు, ఇచ్చే 350 కోట్లు నిధులు, ఇప్పటికి ఆపి, మూడేళ్ళు అయ్యింది. అదీ దిక్కు లేదు. ఇలా దాదాపుగా 16 విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి.
ఇక పొతే, ఈ విభజన హామీల్లో, ఒక రాజకీయ హామీ కూడా ఉంది. ఇవి ప్రజలకు అంతగా ఉపయోగం లేకపోయినా, పరిపాలన సౌలభ్యానికి ఉపయోగపడే హామీ ఇది. అదే యోజకవర్గాల పునర్విభజన. రాష్ట్ర విభజన జరిగినప్పుడు, నియోజకవర్గాల పునర్విభజన చేస్తాం అని చెప్పారు. ఇది కేంద్రం హోం శాఖ పరిధిలో ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అసోం, నాగాలాండ్‌తో పాటు, కొత్తగా విభజించిన జమ్మూకాశ్మీర్ లో, సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో, ఉన్న ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనను మాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతి సారి దీని గురించి కేంద్రానికి చెప్తున్నా, వేరే రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నారు కాని, కేసీఆర్, జగన్ కు మాత్రం షాక్ ఇచ్చారు. అయినా అమరావతి , పోలవరం లాంటి పెద్ద పెద్ద హామీలే పట్టించుకోని కేంద్రం, ఇలాంటి విషయల్లో మనకు న్యాయం చేస్తుందా.