ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా షాక్ ఇచ్చింది. నిజానికి ఇది కేంద్రం షాక్ కాదు, మన రాష్ట్రం చేసుకున్నదే. రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను, అంటే కాపిటల్ expenditure లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకోలేక పోయింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న రాష్ట్రాలకు, కేంద్రం ఎఫ్ఆర్‌బీఎంకు అదనంగా రూ.16,691 కోట్లు రుణం ఇచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖా ఆయా రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. అదనపు రుణం అర్హత పొందే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్ తో పాటుగా, మన పక్కన ఉన్న తెలంగాణ కూడా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చోటు దక్కలేదు. దీంతో ఇక అదనపు రుణం పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. ఏపి మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవటంలో, ఈ సెకండ్ క్వార్టర్ లో బాగా వెనుకపడింది. అయితే మొదటి క్వార్టర్ లో మాత్రం, ఏపి ఈ లక్ష్యాలను చేరుకుంది. అప్పట్లో దాదాపుగా రూ.3 వేల కోట్లు అదనపు రుణం ఏపి పొంద గలిగింది. కానీ రెండో క్వార్టర్ లో మాత్రం, ఏపి వెనుక బడింది. దీంతో ఈ అదనపు రుణం పొందాలి, ఎక్కువ అప్పు చేయలని అనుకున్న ఏపి, ఈ సారి ఆ అర్హత కోల్పోయింది.

jaggan 12112021 2

అయితే మన పక్కన ఉన్న తెలంగాణా మాత్రం, మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవటంతో, వారికి ఎఫ్ఆర్‌బీఎంకు అదనంగా రూ.5 వేల కోట్లు అదనంగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఈ అపవాదు ఉంది. తెస్తున్న అప్పును ఆస్తులు సృష్టించటంలో వెనుకబడుతూ, కేవలం వాటిని పప్పు బెల్లాలు లాగా పంచేస్తున్నారని, దీని వల్ల అప్పు తీసుకున్న పర్పస్ నెరవేరటం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు వస్తున్నా, ఈ సారి కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అయితే ఇలాంటి రాష్ట్రాల కోసమే కేంద్రం గత ఏడాది, మూలధనం వ్యయం కోసం, ఎక్కువ ఖర్చు పెడితే, అదనంగా రుణం పొందే అవకాసం ఇస్తామని చెప్పింది. అయితే ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో, అసలు జీతాలు ఇవ్వటానికే దిక్కు లేదు, ఇక మూలధనం వ్యయం పై ఏమి ఖర్చు పెడతారు ? అందుకే ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో వెనుక బడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read