ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మంచి సంబంధాలే ఉన్నాయని అందరూ భావిస్తున్న సమయంలో, గత కొన్ని రోజులుగా కొన్ని అంశాల పై కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాకులే ఇస్తుంది. ప్రధాని మోడీ, అమిత్ షా లకు చెప్పే, మేము అన్ని పనులు చేస్తున్నాం అంటూ విజయసాయి రెడ్డి చెప్తూ ఉంటారు. కేంద్రం మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అంటూ, వైసీపీ నేతలు కూడా చెప్తూ ఉంటారు. అయితే కేంద్రం నుంచి కీలక అంశాల్లో మాత్రం, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా సహాయం లేదనే చెప్పాలి. వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి ఏమైనా లాభం ఉందేమో కానీ, ఢిల్లీ పెద్దలతో వీరి స్నేహం వల్ల, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగింది ఏమి లేదనే చెప్పాలి. ఇక రాష్ట్రానికి అప్పులు విషయంలో కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అనే వాదన ఉంది. అయితే దాని పై గత వారం, కేంద్రం గట్టిగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుకుంది. అప్పుల లెక్కల్లో గోల్ మాల్ గుర్తించిన కేంద్రం, 17 వేల కోట్ల వరకు అప్పుని, ఇప్పటికే ఏపి అదనంగా వాడుకుందని గుర్తించి, ఈ ఆర్ధిక ఏడాది అప్పు పరిమితిలో, దాన్ని మినహాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపధ్యంలోనే కేంద్రం నుంచి మరో షాకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది.
కేంద్రం నుంచి ఆహర భద్రత కింద ప్రతి నెల పేదలకు ఇచ్చే బియ్యం వస్తూ ఉంటాయి. అవి రేషన్ షాపుల ద్వారా పేదలకు అందిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో, జగన్ మోహన్ రెడ్డి, బియ్యం వ్యాన్లు పెట్టటం, అలాగే అతి ప్రచారంతో, రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని, ఆ బియ్యం తామే ఇస్తున్నట్టు ప్రచారం చేస్తూ ఉండటం, ఆ సమాచారం కేంద్రానికి అందటంతో కేంద్రం అలెర్ట్ అయ్యింది. ఇక నుంచి తాము పంపించే బియ్యం, రేషన్ షాపుల్లోనే ఇవ్వాలని, అలాగే రేషన్ షాపుల దగ్గర, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పధకం ద్వారా ప్రధాని మోడీ ఈ బియ్యం ఇస్తున్నట్టు బ్యానేర్లు పెట్టాలని, కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో కేంద్రం పంపించే కోటా బియ్యం మాత్రం, ఇక నుంచి డీలర్లు దగ్గరకు వెళ్ళే తెచ్చుకోవాలి. కేంద్రం ఆదేశాలు రావటంతో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి చేయాలని పరిస్థితి ఏర్పడింది. దీంతో, ఇప్పుడు రేషన్ షాపుల దగ్గర, ప్రధాని మోడీ బొమ్మతో, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పధకం ద్వారా, బియ్యం ఇస్తున్నట్టు బ్యానేర్లు వెలిసాయి.