జగన్ అక్రమాస్తుల కేసుల్లో, ఒక కేసు అయిన వాన్పిక్ కేసులో, A3 నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన సెర్బియా దేశానికి విహార యాత్రకు వెళ్ళిన సందర్భంలో, ఆయాన ఎయిర్ పోర్ట్ లో దిగగానే, ఇంటర్ పోల్ సాయంతో, అక్కడి పోలీసులు, నిమ్మగడ్డను అరెస్ట్ చేసారు. అయితే నిమ్మగడ్డ అరెస్ట్ వార్తా తెలిసిన వెంటనే, వైసీపీ అలెర్ట్ అయ్యింది. నిమ్మగడ్డ వేరే దేశంలో అరెస్ట్ కావటం, తమ అధినేత ఆ వాన్పిక్ కేసులో A1 నిందితుడుగా ఉండటంతో, ఎక్కడ ఏమి జరుగుతుందో అని భావించి, ముందుగా నిమ్మగడ్డను భారత దేశం రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు ముందుగా మన దేశం సపోర్ట్ చాలా అవసరం. అందుకే, ఈ విషయాన్ని వెంటనే కేంద్రానికి చెప్పి, తమకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం చేత, నిమ్మగడ్డను మన దేశానికి రప్పించ వచ్చు అని అనుకున్నారు.
అనుకున్నదే ఆలస్యం, బాగా పవర్ ఉంటుందని, వైసీపీకి ఉన్న 22 ఎంపీల చేత కేంద్రానికి లేఖ రాయించారు. కేంద్రమంత్రి జైశంకర్ కు 22 మంది ఎంపీలు లేఖ రాసి, ఆయన్ను వెళ్లి కలిసి మరీ పరిస్థితి వివరించారు. నిమ్మగడ్డను ఎలా అయినా మన దేశం తీసుకు రావాలని, దానికి సంబందించిన చొరవ కేంద్రం తరపున చెయ్యాలని, ఈ 22 మంది వైసిపీ ఎంపీలు, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన్ను అరెస్ట్ చేసిన కేసులో అసలు ఆధారాలు లేవని, సెర్బియా పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేసారని, సెర్బియాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా చర్యలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీని పై మాత్రం, కేంద్రమంత్రి జైశంకర్ వేరే విధంగా స్పందించినట్టు సమాచారం. ఇలాంటి విషయాల్లో కేంద్రం జోక్యం ఉండదని తేల్చి చెప్పారు.
అది సివిల్ వివాదమని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని కేంద్ర మంత్రి, వైసీపీ ఎంపీలకు తేల్చి చెప్పారు. అయితే మీరు ఆ వ్యక్తిని జైల్లో కలవాలి అంటే, కేంద్రం దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తుంది కాని, మా వ్యక్తిని అరెస్ట్ చేసారు, విడిచి పెట్టండి అని మేము అడగం అని, కేంద్రం తరుపున తేల్చి చెప్పారు. దీంతో చేసేది ఏమి లేక, ఎంపీలు తిరిగి వచ్చి, విషయం విజయసాయి రెడ్డికి వివరించారు. విజయసాయి రెడ్డికి, పిఎంఓలో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి, ఆయన అటు నుంచి ఏమైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయినా విదేశాల్లో ఒకసారి అరెస్ట్ చేసారు అంటే, ఆధారాలు లేకుండా అరెస్ట్ చెయ్యరు. అరెస్ట్ చేసిన తరువాత, ఇష్టం వచ్చినట్టు విడిచి పెట్టరు. అందులోను ఇది రస్ అల్ ఖైమా దేశం ఇచ్చిన ఫిర్యాదు. మరి నిమ్మగడ్డను, వైసీపీ నేతలు, ఎలా మన దేశానికి తీసుకు వస్తారో చూడాలి.