జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి, ప్రధాని మోడీని కలిసే వేళ, కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంటూ, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, మరిన్ని నిధుల విడుదల కోసం వెళ్తుంటే, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను కూడా ఆపేసి, తన మార్క్ చూపించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ విషయమై అనేక పరిణామాలు జరుగుతున్నాయి. చంద్రబాబు గత మూడు సంవత్సరాల్లో, పోలవరం పనులు 73 శాతానికి తీసుకు వెళ్తే, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒక్క ఇంచ్ కూడా పనులు ముందుకు వెళ్ళలేదు. గడిచిన నాలుగు నేలల్లో పని చెయ్యకపోగా, టెండర్లను రద్దు చేసి, పనులు పరిగెత్తించిన నవయుగని పంపించేసి, రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ నుంచి, ఏపి ప్రభుత్వం ఖర్చు పెట్టిన 6 వేల కోట్లు, కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ నిధులలో సగం అయినా, కేంద్రం ఇస్తుందని అందరూ భావించారు.

jagan 05102019 2

అధికారులు కూడా ఇదే అనుకున్నారు. దీనికి తగ్గట్టే కేంద్ర అధికారుల నుంచి, 3 వేల కోట్ల దాకా విడుదల చేస్తున్నట్టు సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు 3 వేల కోట్లు రావటం తధ్యం అని అందరూ అనుకున్నారు. అయితే, ఈ 3 వేల కోట్లను నిలుపుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్రం నుంచి దాదాపు ఆరు వేల కోట్ల వరకు పాత బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉరది. ఈ నిధుల్లో దాదాపు మూడు వేల కోట్లను రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైందని, ఆ ఫైలును కూడా జలశక్తి శాఖ నుండి కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఆమోదానికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ నిధులు వస్తాయని, రాష్ట్రానికి ఎంతో కొంత ఊరట లభిస్తుందని రాష్ట్ర అధికారులు అనుకున్నారు.

jagan 05102019 3

ఒకటి, రెండు రోజల్లో ఈ 3 వేల కోట్లు, విడుదల అవుతాయని అందరూ అనుకుంటూ ఉండగా, ఆ ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. అయితే సరిగ్గా, జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న వేళ, ఈ పరిణామం చోటు చేసుకోవటం విశేషం. దీంతో ఈ విషయం జగన్ దృష్టికి వెళ్ళటంతో, ఈ విషయం ఈ రోజు ప్రధానితో మాట్లాడటంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే దాదపుగా రెడీ అయిపోయిన నిధులు, జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైన తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం అధికారయంత్రాం గాన్ని విస్మయపరిచింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రం గుర్రుగా ఉండటం, తాము చెప్తున్నా వినకుండా, జగన్ దూకుడుగా వెళ్ళటంతో, కేంద్రం ఈ విధంగా తమ అసహనాన్ని తెలియ చేసిందా అనే అభిప్రాయం కలుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read