కరోనా వైరస్ కట్టడికి ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాలకు రానున్నాయి. కరోనా ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాలతోపాటు వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను ఈ ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేస్తాయని, వీళ్ళు కేంద్రానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయిదుగురు సభ్యులుగల కేంద్ర బృందం హైదరాబాద్లో ఎనిమిది రోజులపాటు పర్యటించి ఆదివారం తిరిగి ఢిల్లీ వెళ్లింది. తాజాగా మరో ప్రత్యేక బృందం రాష్ట్రానికి రానుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే కేంద్రం, దేశంలోనే 20 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. తెలంగాణాలో కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం, మూడు జిల్లాలు ఉన్నాయి.

ఏపీలోని గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రత్యేక కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. మహారాష్ట్రలోని ముంబై, పూణే, థానే, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, ఢిల్లీ సౌత్ ఈసి, ఢిల్లీ సెంట్రల్, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్, రాజస్థాన్‌లోని జైపూర్, జోద్పూర్, తమిళనాడులోని చెన్నై, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా, లక్నో, పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తాయని కేంద్రం తెలిపింది. ఈ బృందాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షిస్తుంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో వ్యాధి ఉధృతి తగ్గుముఖంపట్టేలా అధికారులు తీసుకుంటున్న చర్యలతోపాటు వారికి కావాల్సిన సలహాలను ఈ బృందాలు ఇస్తాయని కేంద్రం వివరించింది.

అయితే, ఈ 20 ప్రాంతాల్లో, మూడు మూడు స్థానాలతో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉన్నాయి అంటే, పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి, కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇది కేవలం పర్యటించి వెళ్ళిపోతారా ? లేక అక్కడే ఉండి, పరిస్థితి అదుపులోకి వచ్చే దాకా, పర్యవేక్షణ చేస్తారా అనేదాని పై మాత్రం, ఆ ఉత్తర్వుల్లో క్లారిటీ లేదు. ఆ ప్రకటనలో, సెంట్రల్ టీమ్స్ ని డిప్లాయ్ చేస్తున్నాం అని ఉంది. దీన్ని బట్టి చూస్తే, కేంద్ర బృందాలు అక్కడే ఉంటాయని తెలుస్తుంది. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, కేసులు కట్టడిలోకి రావటం లేదు. ఈ రోజు కూడా 68 కొత్త కేసులు వచ్చాయి. అనూహ్యంగా వైజాగ్ నుంచి ఈ ఒక్క రోజే ఆరు కేసులు వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read