దశాబ్ధాల ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ, కేంద్రాన్ని దుమ్మెత్తేందుకు ఆయుధంగా మారిన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌కు ట్రాక్‌ రెడీ అయినట్లుగా సమాచారం. కీలకమైన విభజన హామీ, పైసా ఖర్చు లేని ప్రత్యేక రైల్వే జోన్‌ కల సాకారం అయ్యేరోజు దగ్గరలోనే ఉందనే సంకేతాలు ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషాన్ని చేకూర్చాయి. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామన్న సంకేతం ఇవ్వటంతో ఇదైనా తీరే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అయితే, ఇది కార్యరూపం దాల్చే వరకు నమ్మలేం అని, సాక్షాత్తు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కు లేనప్పుడు, ఒక హోం మంత్రి, ఎదో చెప్పిన విషయం పట్టుకుని సంతోషపడితే, మరోసారి భంగపాటు తప్పదని అంటున్నారు.

modi 26072018 2

ఓ పక్క భారతీయ జనతా పార్టీ ఇదే విషయమై ఎప్పటికైనా ప్రత్యేక రైల్వే జోన్‌ సాధించుకువస్తామని చెబుతున్నప్పటికీ ఇతర అంశాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం, దుగ్గరాజుపట్నం పోర్టు ట్రస్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ వంటి విషయాల్లో కేంద్రం జారిపోవడంతో ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తామని చెప్పుకొస్తున్నా ప్రజల్లో నమ్మకం ఏర్పడలేదు. అయితే, మంగళవారం నాటి రాజ్యసభ సమావేశంలో హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేరుగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తున్నట్లుగా ప్రకటన చేయడంతో ఈ విషయంలో ఒక స్పష్టత ఏర్పడిందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. దీనికి ముందు విశాఖకు చెందిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షునితో భేటీ అయి ప్రత్యేక రైల్వే జోన్‌ విషయమై సుదీర్ఘంగా చర్చించారు.

modi 26072018 3

గత నెల (జూన్‌) 13న అమిత్‌షాతో భేటీ అయిన వారిలో పార్లమెంట్‌ సభ్యులు కంభంపాటి హరిబాబు, ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్‌ రాజులు కూడా ఉన్నారు. రైల్వే జోన్‌ విషయంలో అవసరమైన రాజకీయ నిర్ణయాన్ని ఈ సమావేశంలోనే పార్టీ పరంగా అమిత్‌షా తీసుకున్నారు. ఈ విషయాన్ని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు స్వయంగా వెల్లడించారు. రాజకీయ నిర్ణయం తీసుకున్న నెల రోజుల్లో కేంద్రం హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా రాజ్యసభలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఇస్తున్నట్లుగా ప్రకటన చేయడం విశేషం. అయితే ఈ జోన్ వచ్చే దాక నమ్మకం లేకపోవటం ఒకెత్తు అయితే, ఒకవేళ ఇచ్చినా, మన రాష్ట్ర భూభాగం మొత్తం ఈ జోన్ లో కలుపుతారా, లేక ఒరిస్సా ఒత్తిడికి తలొగ్గి, కొంత మేర అటు వైపు కలుపుతారా అనేది కూడా చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read