ఇప్పటికే ఆధార్ గురించి, మొబైల్స్ లో ఉండే యాప్ ల గురించి, వాటి వాల్ల ఎదురవుతున్న సామాన్య ప్రజల ప్రైవసీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనం ఎక్కడ ఉన్నాం, ఏమి మాట్లడుతున్నమో కూడా ట్రాక్ అవుతుందనే అపోహలు ఉన్న వేళ, ఇప్పుడు కేంద్రం తాజగా ఇచ్చిన ఉత్తర్వులు చూస్తే, మైండ్ బ్లాంక్ అవ్వటం ఖాయం. ఇప్పటికే దేశంలో ఉన్న వ్యస్థలు ఎలా నాశనం అవుతున్నాయో చూస్తున్నాం. ఉన్న వ్యవస్థలని అడ్డం పెట్టుకుని, రాజకీయ, వ్యక్తిగత కక్ష తీర్చుకుంటూ, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో, మీ ఇంట్లో ఉండే కంప్యూటర్, ల్యాప్ టాప్ లో ఉండే డేటా కూడా, ఇక కేంద్ర ప్రభుత్వం చేతుకోలోకి వేల్లిపోనుంది అంటే నమ్మగలరా ? ఇప్పటికే నేరస్థుల నుంచి, కంప్యూటర్లు సీజ్ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంది. మరి ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకో ఎవరికీ అర్ధం కావటం లేదు.

nigha 21122018 1

దేశంలోని ఏ కంప్యూటర్‌లో నిక్షిప్తమైన, తయారైన, పంపిన లేదా స్వీకరించిన సమాచారాన్ని అయినా అడ్డుకునే, పర్యవేక్షించే, విశ్లేషించే అధికారం ఇక 10 కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఉంటుందని, ఉత్తర్వులు ఇస్తూ, కేంద్రం అధికారాలు కట్టబెట్టింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 20న జారీచేసింది. దేశంలోని ఏ కంప్యూటర్‌లోకి అయినా చొరబడే స్వేచ్ఛను కల్పించింది. ఈ మేరకు జారీ అయిన ఆదేశాలపై కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. ‘‘ఏ కంప్యూటర్‌లో స్టోర్ చేసిన, పంపించిన, రిసీవ్ చేసుకున్న, జనరేట్‌ అయిన సమాచారాన్నైనా దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, విశ్లేషించవచ్చు...’’ అంటూ సదరు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టంలోని 69(1) సెక్ష‌న్ కింద ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

nigha 21122018 1

కంప్యూటర్ రిసోర్స్‌కు చెందిన సబ్‌స్ర్కైబర్ లేదా సర్వీస్ ప్రొవైడర్ లేదా ఏ వ్యక్తి అయినా ఏజెన్సీలకు అవసరమైన అన్ని సౌకర్యాలను, సాంకేతిక సహాయాన్ని అందచేయవలసి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలా చేయని పక్షంలో ఏడేళ్ల కారాగార శిక్షకు, జరిమానాకు అర్హులవుతారని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి ఈ అధికారాలు పొందిన వాటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ‌, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, సీబీఐ‌, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్ర‌ట‌రియేట్‌, ఢిల్లీ పోలీస్, ఆర్ అండ్ ఏడ‌బ్ల్యూ, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. అయితే ఇప్పటికే, దర్యాప్తు సంస్థలు, అనుమానం ఉన్న వారి దగ్గర నుంచి కంప్యూటర్ సీజ్ చేసి, ఆ డేటా డీకోడ్ చేస్తూ ఉండటం చూస్తున్నాం, మరి ఈ కొత్త ఉత్తర్వులు ఎందుకో, ఎవరి కోసమో, కేంద్రమే చెప్పాలి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read