ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవగాహనరాహిత్యంతో, మరోసారి కేంద్రం ముందు పరువు పోయిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం ఈ రోజు కేంద్రం, రాష్ట్రానికి పంపిన లేఖ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటూ ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ ఒకటి మొదలు పెట్టాలని సిద్ధం అయ్యింది. అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, కొత్త ప్రాజెక్ట్ లు కట్టాలి అంటే, కేంద్రం అనుమతి తప్పని సరి. అయితే తెలిసి చేసారో, లేక తెలియక చేసారో, రాజకీయం కోసం చేసారో, మభ్య పెట్టటం కోసం చేసారో కానీ, ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ప్రకటించి, టెండర్లు పిలిచేసి హడావిడి చేసారు. అయితే దీని పై తెలంగాణా అభ్యంతరం చెప్పింది. నిజానికి ఇది కూడా కేసీఆర్, జగన్ ఆడిన డ్రామా అంటూ, రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈయన కట్టేది లేదు ఏమి లేదు, కేవలం రెండు రాష్ట్రాల మధ్య భావోద్వేగాల కోసం, ఇలా చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే, ఈ విషయం పై తెలంగాణా ఫిర్యాదు చేయటంతో, కేంద్రం సీన్ లోకి ఎంటర్ అయ్యింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి, అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కేంద్రం, కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి, డీపీఆర్ లు ఇవ్వాలని కోరింది.

center 17122020 2

ఆ ఆదేశాలు ప్రకారం కేంద్రానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే డీపీఆర్ పంపించిన తీరు పై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఆ డీపీఆర్ లో ఎలాంటి ప్రాధమిక అంశాలు లేవు కదా అని, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏపి అధికారులకు లేఖ రాసారు. చిన్న చిన్న ప్రాధమిక అంశాలు కూడా ఇందులో లేవని, డీపీఆర్ ఇచ్చే సమయంలో, కొన్ని నిబంధనులు ఉంటాయని, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు కూడా పాటించలేదని, ఇవేమీ ఇవ్వకుండా డీపీఆర్ ను ఏమి చేయం అంటూ, పూర్తి వివరాలు, నిబంధనలు ప్రకారం డీపీఆర్ తయారు చేసి ఇవ్వాలని తిప్పి పంపించింది. దీని పై ప్రతిపక్షం తెలుగుదేశం స్పందిస్తూ, కనీసం డీపీఆర్ కూడా తయారు చేయని వాళ్ళు, మన పాలకులు అంటూ ఎద్దేవా చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read