ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్‌ ఇచ్చింది. వాట్సాప్‌లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని.. అటువంటి తప్పుడు సందేశాలు వైరల్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం కావడం వల్ల అవి నిజమని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో పలువురు అమాయకులపై దాడికి దిగుతున్నారు. ఫలితంగా ఒక్కోసారి బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

wa 03072018 2

పిల్లలను అపహరించుకుపోతున్నారంటూ వాట్సాప్‌లో నకిలీ వార్తలు వైరల్‌గా మారాయి. ఇటువంటి ఘటనలు అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు చాలా బాధించాయి. రెచ్చగొట్టే విధంగా ఉండే సందేశాలు ఇకపై వాట్సాప్‌లో వైరల్‌గా మారకుండా సదరు సంస్థ తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఐటీ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. హింసాకాండను ప్రేరేపిస్తున్న వాట్సాప్‌ మెసేజ్‌లపై ఇప్పటికే పదేపదే వాట్సాప్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న దారుణ హత్యల నేపథ్యంలో వాట్సాప్‌ సీనియర్‌ ప్రతినిధులకు తమ తీవ్ర అసంతృప్తి తెలియజేశామని, తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించామని చెప్పింది.

wa 03072018 3

ఇటువంటి నకిలీ వార్తలు ప్రజల్లోకి వెళ్లడం వల్ల శాంతి, భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. రెచ్చగొట్టే సందేశాలు, అబద్దపు వార్తలు వాట్సాప్‌లో వైరల్‌ కాకుండా చూడాలని ఐటీ శాఖ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా వాట్సాప్‌లో వస్తున్న సందేశాలను నమ్మి ప్రజలు అమాయకులపై దాడికి దిగుతున్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఇలాగే చిన్నారులను అపహరించుకుపోయే గ్యాంగ్‌ తిరుగుతుందని వాట్సాప్‌లో సందేశం వైరల్‌గా మారింది. దీంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పిల్లలను అపహరించుకుపోయే వారిగా భావించి అక్కడి గ్రామస్థులు వారిని కొట్టి చంపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read