ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక కష్టాలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో గత ఆర్ధిక సంవత్సరంలో, పరిమితికి మించి అప్పులు తీసుకుని రావటం వల్ల, ఇప్పుడు పరిస్థితి శ్రుతిమించి, సంక్షోభంలో కూరుకునే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది ఇచ్చిన రుణపరిమితికి మించి, దాదాపుగా 17 వేల కోట్లకు పైగా, డబ్బులను అదనంగా అప్పు తీసుకున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ కనిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్ధిక శాఖ పంపించిన వివరాలతో పాటు, ఆడిట్ జనరల్ పంపించిన ఆడిట్ వివరాలు, ఇవన్నీ చూసిన తరువాత, కేంద్ర ఆర్ధిక శాఖ సెక్రటరీ, రాష్ట్ర ప్రినిసిపల్ సెక్రటరీకి, కొన్ని రోజుల క్రితం రాసిన లేఖను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మెన్ పయ్యావుల కేశవ్ కొద్ది సేపటి క్రితం, మీడియాకు విడుదల చేసారు. ఈ లేఖలో ప్రధానంగా 17 వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ఆర్ధిక సంవత్సరంలో వాడుకుందని, దీని వల్ల, రుణ పరిమితి దాటి బారోయింగ్స్ చేసారని చెప్పి, బహిరంగ మార్కెట్ లో కానీ, ఇతర సంస్థల నుంచి అప్పు తీసుకోవటం వల్ల, రుణ పరిమితి దాటిపోయిందని కేంద్ర ఆర్ధిక శాఖ పెర్కుంది.

modi 10072021 2

ఏదైతే రుణ పరిమితి దాటి 17 వేల కోట్లు గత ఆర్ధిక సంవత్సరంలో తెచ్చారో, దీన్ని ఈ ఆర్ధిక సంవత్సరంలో అడ్జెస్ట్ చేస్తామని కూడా, పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణా విడిపోయిన తరువాత, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరెక్ట్ బారాయింగ్స్ ఏమైతే ఉన్నాయో, వాటికి సంబంధించి రీపేమెంట్, రీయింబర్స్మెంట్ ఏదైతే చేసారో, చివరి అయుదు ఏళ్ళుకు సంబంధించిన వివరాలు కూడా, ఆర్ధిక శాఖ ఆ లేఖలో పేర్కొంది. దీంతో పాటు మార్కెట్ బారోయింగ్స్ తో పాటుగా, ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, పరిమితి మించి తీసుకుందని, ఇది ఆర్ధిక క్రమశిక్షణ తప్పటమే అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆర్ధిక శాఖ రాసిన లేఖ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కేశవ్ డిమాండ్ చేసారు. 17 వేల కోట్ల రూపాయాలు ఈ ఏడాది అడ్జస్ట్ చేస్తే మాత్రం, ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం వచ్చే అవకాసం ఉంది. ఇప్పటికే ఈ నెల ఇప్పటి వరకు జీతాలు అందలేదు, అలాగే తీసుకున్న అప్పు కూడా ఆర్బిఐ మినహాయించుకుంది. చూద్దాం ఎక్కడ తేలతామో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read