ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బండారం కేంద్రం మరోసారి బయట పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడింది అంటూ, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని ఆర్ధిక నిబంధనలను ఉల్లంఘించినట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేవనెత్తిన ప్రశ్నకు, కేంద్రం పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ, సంచలన విషయాలు తెలియ చేసింది. గతంలో పార్లమెంట్ లోని 377 నిబంధన కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆర్ధిక అవకతవకల గురించి, పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో లేవనెత్తారు. రామ్మోహన్ నాయుడు లేవనెత్తిన అంశాలకు , రాత పూర్వకంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక లేఖను విడుదల చేస్తూ, అందులో అనేక అంశాలు చెప్పారు. అందులో చాలా స్పష్టంగా ఏపి ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడిందని, ఇదే విషయం కాగ్ కూడా నిర్ధారించిందని కేంద్రం తెలిపింది. వైఎస్ఆర్ గృహ వసతి పధకం కోసం వినియోగించిన డబ్బులు, మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని, ఆర్ధిక శాఖ పేర్కొంది. మరో పక్క స్టేట్ డిజాస్టర్ ఫండ్ లో, కేంద్ర వాటాగా 320 కోట్లు, అదే విధంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కూడా రాష్ట్రానికి ఇచ్చినట్టు తెలిపారు.

finance 210320222 2

అయితే 2020 మార్చ్ లో ముగిసిన ఆర్ధిక ఏడాదికి సంబందించిన కాగ్ నివేదిక ప్రకారం, వెయ్యి కోట్ల పైన డిజాస్టర్ మ్యానేజ్మెంట్ కింద జమ అయిన నిధులని, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ కు మళ్ళించినట్టు కేంద్ర ఆర్ధికశాఖ స్పష్టం చేసింది. ఖరీఫ్ సీజన్ లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు పంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కాగ్ తన నివేదికలో పేర్కొంటూ, ఆ నిధులను మాత్రం రైతులకు అందచేయలేదని, కాగ్ చెప్పింది అంటూ, కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. ఇది ద్రవ్య వినమయ చట్టాన్ని ఉల్లంఘించటమే అని కేంద్ర పేర్కొంది. ఇలాంటి మళ్లింపు ఆడిటింగ్ నిబంధనలకు విరుద్ధం అని పేర్కొంది. అలాగే పేదల గృహాల కోసం, ఖర్చు చేసిన దాన్ని మూలధన వ్యయంగా ఎలా చూపిస్తారని కూడా కేంద్రం ప్రశ్నించింది. ఇలాంటి అవకతవకలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. మొత్తానికి మరోసారి కేంద్రం అసహనం వ్యక్తం చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోక పోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read