విదేశీ పెట్టుబడి దారులకు, మరింతగా అండగా ఉండటం కోసం, వారికి రక్షణగా ఉండటం కోసం, కేంద్రం కొత్త చట్టం తేనుంది. దీనికి సంబంధించి లైవ్ మింట్ పత్రిక ఒక కధనాన్ని ఈ రోజు ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడిదారులకు పెట్టిన ఇబ్బందులు ద్రుష్టిలో పెట్టుకుని, కేంద్రం ఈ నిర్ణయం తీసుకునట్టు ఆ కధనం సారంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అధికారం చేతులు మారింది. గతంలో చంద్రబాబు హయంలో, సోలార్, విండ్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రం కూడా ఈ పాలసీని మెచ్చుకుంది. పెద్ద ఎత్తున పెట్టుబడి దారులు వచ్చి, మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. చాలా విదేశీ కంపెనీలు, ఈ పెట్టుబడులు పెట్టాయి. వాటిలో కొన్ని, Goldman Sachs, Brookfield, SoftBank, Canada Pension Plan Investment Board, Caisse de dépôt et placement du Québec, JERA Co. Inc., GIC Holdings Pte Ltd, Global Infrastructure Partners, CDC Group Plc, EverSource Capital, World Bank’s International Finance Corp.

livemint 18112019 3

అయితే ప్రభుత్వం మారగానే, చంద్రబాబు హయంలో చేసిన విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష చేస్తామంటూ, జగన్ ప్రభుత్వం పూనుకుంది. ఈ విషయం పై, ఇన్వెస్టర్స్ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారిన ప్రతిసారి, ఇలా చేస్తారు అంటూ మండి పడ్డాయి. తమకు ఇలాంటి చర్యలు తీవ్ర నష్టం తెచ్చిపెడతాయని, జపాన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు, తమ పెట్టుబడిదారులను కాపాడండి అంటూ, కేంద్రానికి కూడా లేఖలు రాసాయి. మరో పక్క ఈ కంపెనీలు కూడా కోర్ట్ కు వెళ్ళాయి. కోర్ట్ కూడా వీరిని అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఆ ఉత్తర్వులు రద్దు చేసింది. తరువాత కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలతో, ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అన్ని ఒప్పందాలు సమీక్షంచం అని, అనుమానం ఉన్న వాటిని మాత్రమే, చూస్తామని చెప్పి, ఈ వివాదానికి తెర దించింది.

livemint 18112019 2

అయితే ఏపి ప్రభుత్వం చూపించిన దానికి, విదేశీ కంపెనీలు ఇబ్బంది పడ్డాయి. భవిషత్తులో ఇలా అయితే కష్టం అంటూ, కేంద్రానికి మోర పెట్టుకున్నాయి. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. భవిష్యత్తులో, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇలా ఇష్టం వచ్చినట్టు, సమీక్షలు చేసి, పెట్టుబడిదారులను, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి, ఒక చట్టం తీసుకువస్తున్నామని, చెప్పారు. పెట్టుబడిదారులకు, ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, అక్టోబర్ లో జరిగిన ఒక సదస్సులో, మీకు అండగా ఉండటామని ప్రకటించగా, కొన్ని రోజుల క్రితం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కు అండగా ఉంటామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read