అవిశ్వాసం సందర్భంగా, కేశినేని నాని ఇచ్చిన లాస్ట్ పంచ్ గుర్తుందా ? రెండు గంటలు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన మోడీకి, లాస్ట్ పంచ్ అదరగొట్టారు నాని. ‘‘ప్రధానమంత్రి ఎంతో అద్భుత ప్రసంగం చేశారు. మీరు(ప్రధాని) గొప్ప నటులు, డ్రామా ఆర్టిస్ట్. దాన్ని అంగీకరిస్తున్నా. మీ ఒకటిన్నర గంటల ప్రసంగం వింటున్నప్పుడు బ్లాక్‌బస్టర్ సినిమా చూస్తూ కూర్చున్నట్టు అనిపించింది’’ అని బెజవాడ నాటు భాషలో ప్రధానికి జర్క్ ఇచ్చారు. అయితే కేశినేని నాని వ్యాఖ్యలకు మన రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే, మోడీ పెద్ద యాక్టర్ అని అందరికీ తెలుసు. కాని, మోడీ మొఖం మీదే ఆ మాట చెప్పటంతో, అందరూ మా మనుసులో మాటే చెప్పారు అంటూ , అభినందించారు.
అయితే, ఇంకా ఈ రీసౌండ్ ఢిల్లీ పెద్దలకు పోయినట్టు లేదు. కేశినేని నానిని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ తన ఛాంబర్‌కు పిలిపించుకున్నారు. మీ స్పీచ్ పట్ల ప్రధాని అసహనం వ్యక్తం చేసారని, చెప్పారు. అయితే, నాని మాత్రం, ఇవన్నీ నాకు చెప్పద్దు అని, మా లోక్‌సభాపక్ష నేత తోట నరసింహంతో మాట్లాడుకుంటే మంచిందని అన్నారు. అనంత్‌కుమార్ మాత్రం, ఇవన్నీ కాదు, నేను మీతోనే మాట్లాడతాను అంటూ చెప్పారు. ప్రధానిని ఎవరైనా నిండు సభలో అలా సంభోదిస్టారా ? ప్రధానికి గౌరవం ఇవ్వాలని అనంత్‌కుమార్ హితవు చెప్పారు. ప్రధాని ఉండగానే, అలా మాట్లాడటం చాలా తప్పు అని చెప్పారు.
దీంతో నాని అదే స్థాయిలో ధీటుగా బదులు ఇచ్చారు. మోదీ కూడా ప్రధాని స్థాయికి తగ్గట్టుగా వ్యవహరిస్తే, మేము సబ్జెక్టు మాత్రమే మాట్లాడే వాళ్ళం అని, మేము అడిగిన 18 విభజన హామీల గురించి చెప్పకుండా, రాజకీయాలు ప్రధాని మాట్లాడవచ్చా ? చంద్రబాబు పరిణతి లేని నాయకుడు, జగన్ లాంటి దొంగ ట్రాప్ లో పడ్డాడు అంటూ, ప్రధాని అలా మాట్లాడితే ఎలా అని నాని అన్నారు. 5 కోట్ల మంది ప్రజలు, ప్రధాని ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమి మాట్లాడతారా అని ఎదురు చూస్తే, ప్రధాని రాజకీయ ప్రసంగం చేసారని, అందుకే మేము అలా మాట్లడాల్సి వచ్చిందని, అయినా అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన తనకు సభలో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వకుండా ఎందుకు మైక్ కట్ చేశారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు లోక్‌సభలో ఏ అవకాశం వచ్చినా వదులుకోబోమని స్పష్టం చేశారు. తాము సభలో సెటైర్లు వేయకుండా ఉండాలంటే ఏపీకి న్యాయం చేయమనండి అని అనంత్‌కుమార్‌కు స్పష్టం చేసి ఛాంబర్ నుంచి బయటకు వచ్చారు.