ఇప్పటికే బీజేపీ, వైసీపీ పార్టీలు లోపాయకారీగా కలిసి పని చేస్తున్నాయి అనే ప్రచారం, ఏపిలో బలంగా ఉంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కూడా ఇరు పార్టీలో లోపాయికారీగా బాగానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. అటు కేంద్రం నుంచి విపరీతమైన అప్పులు చేస్తున్నా, పెద్దగా పట్టించుకోకపోగా, ఇంకా ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. అలాగే ఇటు వైసిపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, కేంద్రాన్ని ఇరుకున పెట్టకుండా, రాజ్యసభలో అన్ని బిల్లులకు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి నుంచి జగన్ మోహన్ రెడ్డికి ఆఫర్ వచ్చింది. జగన్ తనకు మంచి మిత్రుడు అని చెప్పిన కేంద్రమంత్రి అథవాలే, జగన్ మోహన్ రెడ్డి ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అంటే, ఇప్పటి దాకా తెర వెనుక ఉన్న వ్యవహారం, ఇప్పుడు బహిరంగం కానుంది. జగన్ ఎన్డీఏలో చేరితే, అనేక ప్రయోజనాలు ఉంటాయి అంట. హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో, అనేక ఉపయోగాలు ఉంటాయి అంట. మరి ఈ ఆఫర్ కు జగన్ మోహన్ రెడ్డి ఏమంటారో, మరి జగన్ ఒప్పుకుంటే, మోడీ, అమిత్ షా ఏమంటారో కానీ, కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనతో, వైసీపీ, బీజేపీ మధ్య ఉన్న స్నేహ సంబంధం మరో సారి బయట పడింది
కేంద్ర మంత్రి నుంచి జగన్ కు బంపర్ ఆఫర్.. మోడీ ఒప్పుకుంటారా ?
Advertisements