కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ గత వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని సీఎం రమేష్‌ను కేంద్రమంత్రి కోరారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనలో ఉంది అంటూ పాత పాటే పాడారు. అయితే కాల పరిమితితో కూడిన హామీ ఇవ్వాలని రమేష్ కోరారు. దీని పై చర్చలు జరుగుతున్నాయి అంటూ పాత సమాధానమే చెప్పారు కేంద్ర మంత్రి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం వారం రోజులుగా దీక్ష చేయడంతో సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించింది. తక్షణ వైద్యం అందించకపోతే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌ను టీడీపీ ఎంపీలు కలిసి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ramesh 27062018 2

విభజన చట్టంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని వివరించారు. కడపలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేస్తున్న దీక్ష అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. 2014లో మెకాన్ తన నివేదికలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని పేర్కొంది. తర్వాత అక్కడ పరిస్థితి మారింది. కడపలో కొత్త గనులు ఉన్నట్లు కనిపెట్టారు. కాబట్టి అక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే మెకాన్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమేనంటూ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఇప్పుడు కడప ఉక్కు... ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో రాష్ట్ర ప్రజల్లో సెంట్‌మెంట్‌గా మారిందని, కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎంపీలు బీరేంద్ర సింగ్‌ను కోరారు.

ramesh 27062018 3

మరో పక్క, మంత్రి బీరేంద్రర్‌సింగ్ మీడియాతో మాట్లాడారు.. కడప, ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రర్‌సింగ్ స్పష్టం చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీలు తనను కలిసి చర్చించారని కేంద్రమంత్రి అన్నారు. అలాగే ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి దీక్ష విరమించాలని ఫోన్లు కోరినట్లు తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీపై టాస్క్‌ఫోర్స్ రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలుంటాయని చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా సహకారం అందించాలన్నారు. ఈ విషయంపై టీడీపీ ఎంపీలు కూడా సంతృప్తి చెందారని వెల్లడించారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఎంత అందుబాటులో ఉందన్నదాని పై వివరాలు కోరినట్లు చెప్పారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నామని బీరేంద్రసింగ్ చెప్పుకొచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read