పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇవాళ ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలోజరుగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి తాను హాజరు కావడం లేదంటూ కుశ్వాహ చెప్పిన కొద్దిసేపటికే... ఆయన ఎన్డీయేలో కొనసాగుతారా, లేదా అన్నదానిపై ఊహాగానాలు వెల్లువెత్తాయి.

modi 012122018 1

ఈ నేపథ్యంలోనే కుశ్వాహ ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీకి ఒక్క సీటు కంటే ఎక్కువ ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించడంతో.. కుశ్వాహ ఇటీవల ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీహార్‌లో కుశ్వాహ పార్టీకి ఒక్క సీటుకంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పిన కాషాయ పార్టీ... సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీయూతో మాత్రం సమాన సంఖ్యలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించింది. దీంతో తమకు గౌరవనీయ సంఖ్యలో సీట్లు కేటాయించని పక్షంలో 2019 ఎన్నికల్లో ఎన్డీయే మూల్యం చెల్లించక తప్పదని కుశ్వాహ ముందే చెప్పారు.

modi 012122018 1

బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీకి చెందిన ఆయ‌న‌.. మోదీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార‌శైలిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. అయిదేళ్ల క్రితం ఎన్డీఏలో క‌లిశామ‌ని, ఎన్నో ఆశ‌ల‌తో చేరామ‌ని, బీహార్ ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ వాటిని అమ‌లు చేయ‌లేక‌పోయార‌ని, అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు త‌న లేఖ‌లో తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ లో తొక్కేయటానికి మోడీ, అమిత్ షా ప్రయత్నాలు చెయ్యటం కూడా తెలిసిందే. దీంతో కేంద్ర‌మంత్రి ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. ఇవాళ ఉద‌యం కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని కూడా క‌లిశారు. బీజేపీతో క‌లిసి ప‌నిచేస‌ది లేద‌న్న విష‌యాన్ని ఉపేంద్ర ఇవాళ వెల్ల‌డించ‌నున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read