ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అనేవి ఎలా జరుగుతున్నాయో, ప్రజాస్వామ్యం ఎలా అపాహస్యం అవుతుందో, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచి చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే, లోకల్ లీడర్స్ హవా ఉంటుంది కాబట్టి, అలా గుద్దుకున్నారు అనుకున్న, చివరకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. ఉదయం నుంచి టీవీల్లో, సోషల్ మీడియాలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలు, ఏ రకంగా జరుగుతున్నాయో చూసాం. అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. టిడిపి నేతలు ఫిర్యాదులు కూడా చేసారు. ఎట్టకేలక ఈ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్రంలో ఉండే చీఫ్ ఎలేక్టరియల్ ఆఫీసర్ స్పందించారు. దొంగ ఓట్లు వేసే వారిని అరెస్ట్ చేయాలని, వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా, పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఆదేశించారు. అయితే మరి ఇవి ఎంత వరకు గ్రౌండ్ లో అమల్లోకి వస్తాయో చూడాలి..
చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్, ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల కమిషన్...
Advertisements