రజకులని మాత్రమే పిలవాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్జ్ఞతలు తెలిపిన రజక సంఘ నేతలు ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయాలని పిలుపు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు హామీ మేరకు రజకులని మాత్ర్మే పిలవాలని ఆదేశిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాల నుంచి రజకులు గ్రామాల్లో అరే సాకలోడా ఒరే సాకలి ఇంకా ఘోరమైన అంశాలతో పదజాలంతో దూషించడం నిషేధింజారు. కులం పేరుతో బూతులు తిట్టకూడదు. కొన్ని గ్రామాల్లో బట్టలు ఉతిక పోతే గ్రామ బహిష్కరణలు దారుణమైన పరిస్థితి రజకులు అనుభవిస్తున్నారని గతంలో రజక సంఘ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన తగిన విధంగా చర్యలు తీసుకున్నారు.
ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రజకుల కోసం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈనేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజకులు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. దాంతోపాటు రజకులను ఎస్సీ జాబితా చేర్చడంపై ఒక కమిటీని వేస్తామని హామీ ఇవ్వడం,ఇస్త్రీ షాపులకు 150 యూనిట్లు కరెంటు ఉచితంగా అందించడం, దోబీఘాట్లుకు ఉచిత కరెంటు అందించి, ఆదరణ పథకం కింద రజకులకు వాషింగ్ మిషన్లు ఇస్త్రీ పెట్టెలు, పది వేల రూపాయల ఎన్టీఆర్ భరోసా కింద ఇవ్వడం జరిగినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రజక సంఘ నేతలు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్యమంత్రిపై తమ గౌరవాన్ని చాటేందుకు గురువారం రాష్ట్రంలో ఉన్న రజకులు అందరు కూడా పాలాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి రావాలని రజకులు అందరు కూడా కష్టపడి పనిచేయాలని ప్రతి ఒక్కరు నిబద్ధతతో తమ గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును గెలిపిద్దామని రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు అంజిబాబు, చైతన్య సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గ్రంథం రవి, రజక కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి నారాయణలు స్పష్టం చేశారు. రజకుల ప్రయోజనాలు కాపాడటానికి జీవో రావడానికి ముఖ్య కారణమైన టీడీపీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ కి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయ లక్ష్మికి ధన్యవాదాలు చెప్పారు.