ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకీ దళితుల పై దాడులు పెరిగిపోతున్నాయి అంటూ, దళిత సంఘాలు ప్రతిపక్షాలు ఆరోపిస్తునే ఉన్నాయి. గత వారం, విజయవాడలో దళితలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగిన తరువాత, ఆ సమావేశంలో పాల్గున్న జడ్జి రామకృష్ణ, ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అయితే ఆ తరువాత రోజే జడ్జి రామకృష్ణ సోదరుడు పై, మదనపల్లిలో దాడి జరిగింది. ఈ దాడి మంత్రి పెద్ది రెడ్డి చేపించారని, జడ్జి రామకృష్ణ ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం, ఇది తెలుగుదేశం నేతలు చేసారు అంటూ, కొత్త విషయం చెప్పారు. అయితే ఇది విశ్వసించని దళిత సంఘాలు, ఆ దాడికి నిరసనగా ఈ రోజు చలో మదనపల్లికి పిలుపు ఇచ్చాయి. దీంతో నిన్నటి నుంచే, రాష్ట్రం నలు మూలల నుంచి దళితులు మదనపల్లి బయలు దేరారు. అయితే ఈ క్రమంలో అక్కడ చిన్న ర్యాలీ చేసి, ఒక బహిరంగ సభ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి ప్రభుత్వం, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

న్యాయవాది శ్రావణ్‍కుమార్‍, రామకృష్ణలను పోలీసులు హోటల్ లోనే నిర్బంధించారు. హోటల్ గది నుంచి వారిని బయటకు రానివ్వలేదు. దీని పై వారు మండి పడ్డారు. నిరసన తెలిపే హక్కు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్షంలో ఉండగా, ఇదే పని చేసి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర చేసే వారా అని ప్రశ్నించారు. అయితే చలో మదనపల్లె భగ్నానికి పోలీసుల విఫలయత్నం అయ్యారనే చెప్పాలి. ఆంక్షల వలయాన్ని ఛేదించుకుని వేలాదిగా మదనపల్లె దళితులు చేరుకున్నారు. అడుగడుగునా పోలీసుల అడ్డంకులు, అరెస్టులు చేసారు. మదనపల్లిలోని, అంబేద్కర్ చౌరస్తా, సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద పోలీసులు అనేక మందిని అరెస్ట్ చేసారు. మరో పక్క, తిరుపతి హోటల్‍లోనే అడ్వకేట్ శ్రవణ్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. హోటల్ బయట కొద్ది సేపు ఉద్రిక్త వాతవరణం నెలకొన్నా, పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా, అరెస్ట్ లు చేసినా, వారి నిరసనను గట్టిగా తెలపటంలో సఫలం అయ్యారు. జడ్జి రామకృష్ణ, జడ్జి శ్రవణ్ కుమార్ ని నిర్బంధించిన దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు https://youtu.be/C7aWiXwb3cw

Advertisements

Advertisements

Latest Articles

Most Read