అసెంబ్లీ సమావేశం, రెండో రోజు ప్రారంభం అయ్యాయి. అయితే అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్ను. శాసనసభ ప్రాంగణంలో ఒక మార్షల్ చేసిన ఓవర్ ఆక్షన్ తో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ లోపలకి ప్రవేశిస్తున్న సమయంలో, ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు అసెంబ్లీలోకి వెళ్తూ ఉండగా, చంద్రబాబుని ఫోన్ తో విజువల్స్ తీసాడు ఒక మార్షల్. అయితే ఈ పరిణామంతో, ఒక్కసారిగా చంద్రబాబు సిబ్బంది అలెర్ట్ అయ్యారు. మార్షల్ ఫోటో తీసిన వెంటనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడ ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబుని ఫోటోలు తీసిన మార్షల్ ను చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు సెక్యూరిటీ అదుపులోకి తీసుకోవటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అలెర్ట్ అయిన చీఫ్ మార్షల్ చంద్రబాబు వద్దకు వచ్చి క్షమాపణ చెప్పారు. చీఫ్ మార్షల్ క్షమాపణ చెప్పటంతో, అతన్ని వదిలి పెట్టారు అయితే మార్షల్ తీరు పై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అతను ఎందుకు ఫోటోలు తీసాడు, ఎవరు తీయమంటే తీసారు అనే విషయం తేల్చాలి అంటూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.

mashal 19112021 2

సభలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు, ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. బుచ్చయ్య చౌదరి ముందుగా ఈ విషయం పై, స్పీకర్ వద్ద లేవనెత్తారు. ఇన్నాళ్ళు సభలో ఉన్నాం అని ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని అన్నారు. దీని పై విచారణ చేయాలని అన్నారు. చంద్రబాబు కూడా మాట్లాడతూ, అసలు ఇలా ఏందుకు జరిగిందో తేల్చాలని, మీరు ఫోటోలు తీయమన్నారా చెప్పండి అంటూ స్పీకర్ ని ప్రశ్నించారు. చంద్రబాబు నిలదీయటంతో, స్పీకర్ మాట్లాడుతూ, దీని పై తనకు సమాచారం లేదని, అసలు ఇది ఎందుకు జరిగిందో, తను ఎందుకు ఇలా చేసారో నేను కనుక్కుని, తగిన చర్యలు తీసుకుంటాం అంటూ స్పీకర్ చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన విరమించారు. నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడుతున్న మాటలు అందరికీ తెలిసిందే. చంద్రబాబుని చూడాలని ఉంది అంటూ జగన్ మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్తూ, చంద్రబాబుని హేళన చేస్తాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read