అమరావతి రాజధానిగా వుంటుందని, తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని ఎన్నికల ముందు బహిరంగ సభల్లో మైక్ కొట్టీ మరీ చెప్పిన వైఎస్ జగన్ రెడ్డి, సీఎం అయిన వెంటనే మాట మార్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయిన అమరావతి ప్రజారాజధాని కోసం పెట్టే ప్రతీ రూపం వందింతలు ఆదాయం తెచ్చి పెడుతుంది. అయితే ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాంతం, ఒక కులంపై కక్షతో విఫలమైన దక్షిణాఫ్రికా మోడల్ మూడు రాజధానుల ప్రతిపాదన ప్రకటించారు. శాసన రాజధాని అమరావతిగా ఉంచుతున్నామని, పరిపాలనా రాజధాని విశాఖ చేశామని, న్యాయరాజధానిగా కర్నూలు అని ప్రకటించారు. తమ మూడుముక్కలాటకి అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యమంటూ మూడు ప్రాంతాల్లో పెయిడ్ ఉద్యమాలు, గర్జనలు ఆరంభించారు. మూడు ప్రాంతాల్లోనా చంద్రబాబుని అడుగుపెట్టనివ్వకుండా పోలీసులు, పెయిడ్ మేధావులను ప్రయోగించారు. ఇది విఫలం అయ్యింది. ఎంత స్పాన్సర్ చేస్తున్నా మూడు రాజధానుల ఉద్యమం ఊపందుకోలేదు. రోడ్లపై మూడు గుంతలు కప్పలేని పాలకుడు జగన్ రెడ్డి మూడు రాజధానులు ఎలా కడతాడంటూ చదువుకోని జనంలో సైతం క్లారిటీ వచ్చేసింది.
అదను చూసిన చంద్రబాబు తన రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. ముందుగా ఉత్తరాంధ్ర టూరులో ఒక రాష్ట్రం-ఒక రాజధాని అంటూ నినదించి లక్షలాది జనంతో జై కొట్టించారు. దీనికంటే ముందు న్యాయరాజధాని పేరుతో అడ్డుకోవాలని చూసిన కిరాయి గర్జకులను కూడా గట్టి హెచ్చరిక చేశారు. రాయలసీమలోనూ అమరావతి రాజధాని జన అంగీకారం నినాదాలతో సాధించారు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పిలుపునివ్వక్కర్లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ప్రజారాజధానే మా ఆకాంక్ష అని చాటారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ అంతర్గత చర్చల్లో మూడు రాజధానులతో మాకు మూడుపోయిందని, చంద్రబాబు ఒకే రాజధాని నినాదం కలకాలం నిలిచేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.