2014లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు పనిపై మాత్రమే శ్రద్ధపెట్టారు. దానితో ఎవరిని కలవడానికి సమయం దొరికేది కాదు. ఇప్పుడు సమయం దొరకడంతో అందరి వద్దకెళ్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆహ్వానించిందే తడవుగా వివాహాది శుభకార్యాలలో పాల్గొంటున్నారు. . కొన్ని వివాహాలకు చంద్రబాబు వెళ్తే... ఆ కుటుంబాలు మురిసిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనడం,చినజీయర్ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.దాని గురించి తెలుసుకోవాలంటే ఈ కధనం చదవలిసిందే. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు, ఒకసారి పుష్కరాల్లో, తరువాత ఒకసారి సియంఓ లో తప్పితే, 2019 వరకు గుంటూరు దగ్గర ఉన్న సీతానగరంలో ఉన్న త్రిదండి చినజీయర్ ఆశ్రమాన్ని సందర్శించలేదు. ఇదిలావుంటే... 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చినజీయర్ స్వామివారి ఆశ్రమానికి రావాలని చంద్రబాబునాయుడుకి ఆహ్వానం అందింది.
చినజీయర్ స్వామివారికి, చంద్రబాబుకు మధ్య అనుసంధానకర్తగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యవహరించారు . ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చినజీయర్ స్వామి కి గొప్ప భక్తుడు. గుంటూరులోని సీతానగరం, తెలంగాణాలో ఉన్న ముచ్చింతల ఆశ్రమాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో చంద్రబాబుని చినజీయర్ పుట్టిన రోజు ఉండటంతో ఆ వేడుకలకు హాజరు కావలిసిందిగా ఆశ్రమ సభ్యులు చంద్రబాబు నాయుడుని కలిసి ఆహ్వానం అందించారు. ఆ విధానంగా దాదాపుగా 5సం" తరవాత మళ్ళీ చంద్రబాబు త్రిదండి చినజీయర్ స్వామి గారిని కలిశారు. ఈ వేడుకల్లో పాల్గొని నారా చంద్రబాబు నాయుడు, చినజీయర స్వామి వారికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. చినజీయర్ స్వామి కూడా చంద్రబాబు గారిని ఆశీర్వదించారు.
ఆ సందర్భంగా చంద్రబాబు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసారు. పెద్దజీయర్, చినజీయర్ స్వాములు లోకకళ్యాణం కోసం చేసిన పనులను కొనియాడారు. ఆరోజు ఆశ్రమంలో చంద్రబాబునాయుడు దాదాపుగా రెండున్నర గంటలసేపు గడిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు బయలుదేరే సమయంలో సెల్ఫీలు కోసం జనాలు పోటీపడ్డారు. అయితే 5 ఏళ్ళ తరువాత చంద్రబాబు, జీయర్ కలియిక పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతుంది. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఇది కేవలం చంద్రబాబు వ్యక్తిగత ప్రకటన అనే వాదన తెలుగుదేశం వైపు నుంచి వస్తుంది. గత 5 ఏళ్ళలో అధికారంలో ఉండగా అందరికీ దూరం అయ్యారని, ఇప్పుడు అన్ని వర్గాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారని, టిడిపి వైపు నుంచి వినిపించే వాదన. మరో పక్క వైసీపీ మాత్రం, జరిగిన విషయాల పై ఆరా తీస్తుంది. చంద్రబాబు ఎందుకు జీయర్ కు దగ్గర అవుతున్నారు, ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందా ? లాంటి అంశాల పై కూపీ లాగుతుంది.