ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయి. టిడిపికి అనుకూలమైన వాతావరణం రాష్ట్రమంతా ఏర్పడింది. ఈ సారి అధికారం దక్కడం ఖాయమని టిడిపి సీటు ఎలాగైనా సాధించాలని ఆశావహులు ఎత్తుగడలు పన్నుతున్నారు. కొందరైతే అధిష్టానంపై బ్లాక్ మెయిలింగ్, ఒత్తిడులకీ దిగుతున్నారు. కౌరవసభ నుంచి వెళ్లిపోతున్నానని, గెలిచి టిడిపి అధికారం చేపట్టి గౌరవసభలో మళ్లీ అడుగు పెడతానని చంద్రబాబు భీషణ ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లోనూ తెలుగుదేశం పట్ల క్రేజ్ బాగా పెరిగింది. ఇటువంటి సమయంలో మొహమాటాలకి పోయి, ఒత్తిడులకి లొంగి సీట్లు ఇస్తే..లక్ష్యం చేరుకోవడం కష్టమని చంద్రబాబే ఫిక్స్ అయ్యారు. సత్తెనపల్లి టిడిపి కన్నా లక్ష్మీనారాయణకి ప్రకటిస్తూనే ఇదే సంకేతాలు పంపారు బాబు. దీనిపై కొందరు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఒత్తిడి పెంచాలని చూస్తే..సీబీఎన్ నుంచి వచ్చిన సమాధానం `` ఈసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో తాను ఏ మొహమాటాలూ పెట్టుకోదలచుకోలేదు`` అని స్పష్టం చేశారు. మొహమాటపడి టికెట్లు ఇస్తే ప్రభుత్వంలోకి రాలేమంటూ కుండబద్దలు కొట్టారు. అభ్యర్థుల ఎంపికపై ఐదు మార్గాల్లో సర్వేలు నివేదికలు పరిశీలించిన తరువాతే ఎంపిక ఉంటుందని చెప్పారు. మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం సత్తెనపల్లి టికెట్ దక్కకపోవడంపై అలకబూని, రకరకాలుగా ఒత్తిడి పెంచే మార్గాలని ఎంచుకున్నారు. ఆయనలాంటి వారికి అందరికీ ఇదే సమాధానం అని చెప్పకనే చంద్రబాబు చెప్పారు. ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో వచ్చేవారిని దగ్గరకు రానివ్వొద్దని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలపైనా నియంత్రణలో ఉండాలంటూ సంకేతాలు పంపారు. తాము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదని తేల్చేశారు. మొత్తానికి చంద్రబాబు చాలా క్లియర్ గా ఉన్నారు. మొహమాటాల్లేవు, ఒత్తిళ్లకి లొంగేది లేదని స్పష్టమైన సంకేతాలిచ్చేశారు.
చంద్రబాబు చాలా క్లియర్గా ఉన్నారు.. సొంత పార్టీ నేతలకి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి...
Advertisements